కృష్ణా జిల్లాలో పేరున్న బీసీ నాయకుడు పార్థసారధి వైఎస్ హయాంలోనే మంత్రి. కానీ జగన్ రెడ్డి ముందు ఆయన జుజుబీ. ఎందుకంటే.. బూతులు తిట్టలేడు. తాము ఎన్ని సార్లు చెప్పినా బూతులు తిట్టలేదని ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తున్నారు జగన్ రెడ్డి. ఇదే విషయాన్ని తాడేపల్లికి పిలిపించి మరీ చెప్పారు. ఆయన మాటలు విని అవాక్కయిన పార్థసారధి.. అంత అదృష్టం అక్కర్లేదని దండం పెట్టి వచ్చేశారు.
పార్థసారధికి అందుకే టిక్కెట్ ఇవ్వడం లేదట !
పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి ఈ సారి టిక్కెట్ లేదని చెబుతున్నారు. ట్రాన్స్ ఫర్ అని.. మచిలీపట్నం లోక్ సభ అని మీడియాకు లీకులిస్తున్నారు కానీ.. అసలు టిక్కెట్ లేదని జగన్ రెడ్డి సంకేతాలిచ్చారు. ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం తర్వాత ఓ పది మంది నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి సీఎం దగ్గరకు తీసుకు వెళ్లారు. అక్కడ సీఎం… మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పోల్చి…. ఆయన నోటి కంపే ఎక్కువ నచ్చింది.. మీరు అలా లేరు.. అందుకే నాకు దూరమయ్యారని చెప్పి పంపారట. అలాంటి తిట్లు తాను తిట్టలేనని.. పార్థసారధి టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. వైసీపీలో ఈ చర్చ వింతగా అనిపించడం లేదు కానీ.. బయటమాత్రం జగన్ రెడ్డి పాలిటిక్స్ ఇంత డర్టీగా ఎందుకు ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే తిట్ల రాజకీయాలు
“: అమ్మాయ్.. చంద్రబాబును బాగా తిట్టమంటున్నాడు ” అని పెద్ద మనిషి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో… అప్పుడే మైక్ సర్దుకుంటున్న రోజాకు చెప్పించారు సీఎం జగన్. మైక్ ఆన్ లో ఉండటంతో ఈ విషయం సభకు వచ్చిన వారందరికీ వినిపించింది. మీరు ఇలా హింటివ్వాలే కానీ నా నోటి కంపు ఎంతో చూపిస్తానన్నట్లుగా ఉండే ఉండే రోజా కంపు కంపుగా తిట్టేశారు. తాను మహిళను అనే విషయాన్ని కూడా మార్చి పోయారు. ఇది వైసీపీ నిర్వహించిన ఓ ప్లీనరీలో జరిగింది. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి…. జగన్ రెడ్డి విపక్ష నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ నేతలతో అధికార పార్టీ నేతల్ని… చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని అలా తిట్టించిన జగన్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చాక తన విశ్వరూపం చూపించారు. తిట్టే వారికే పదవులు అనే అర్హత పెట్టారు. ఇలాంటి తిట్లలో ముందుండేవారు పదవులు పొందుతున్నారు. కొందరు ఎక్కువ తిట్టేసి.. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ప్రాణభయంతో పారిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అయినా వారిని పదవుల్లో పక్కన పెట్టారు. ఎందుకంటే వారికి మరింకేం చాయిస్ లేదు. ఇప్పుడు వైసీపీలో తిట్ల దండకం వినిపిస్తే.. అమ్మ, బాబుల్ని బూతులు తిడితేనే… జగన్ రెడ్డికి విధేయులు లేకపోతే లేదు.
విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అందరూ ఇందుకే !
విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెండ్. ఆయన లాంగ్వేజ్, ట్వీట్లు అత్యంత ఘోరంగా ఉంటాయి. ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అదే భాష ప్రయోగిస్తారు. అలా అయితేనే వైసీపీలో పదవులు వస్తాయన్న సంకేతాలను ముందే ఇచ్చారు. కృష్ణా జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉండగా… జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వడానికి ఆయన బూతులే కారణం. అంత కంటే ఎక్కువ బూతులు తిట్టిన పేర్ని నాని, కొడాలి నానిని పక్కన పెట్టారు. వారికి మరో చాయిస్ లేకుండా చేశారు కాబట్టి వారిని జగన్ పక్కన పెట్టారన్నమాట. ఓ రకంగా వైసీపీ బూతుల ఫ్యాక్టరీ అయిపోయింది.
జగన్కు ఇదేమైనా మానసిక సమస్యనా ?
పాలిటిక్స్ అంటే డర్టీ. కానీ తెర వెనుక ఈ డర్టీ అంతా ఉంటుంది. ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యమా అని బూతుల రాజకీయాలను తీసుకు వచ్చారు. ప్రజలు అసహ్యహించుకుంటారని తెలిసినా వాటిని వాడుక భాషగా మార్చేందుకు ప్రయత్నించారు. జగన్ రెడ్డి కి ఇష్టం కాబట్టే వాళ్లంతా ఇలా తిడుతున్నారు. ప్రత్యేకంగా జగన్ రెడ్డి బ్యాక్ ఆఫీస్ నుంచే ఈ తిట్ల దండకం స్క్రిప్టులు వెళ్తాయి. ఇలా ప్రతిపక్ష నేతల్ని తిట్టించడం ఆయనకో మానసిక సమస్యగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.