వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పనంగా వచ్చిన ఆస్తుల కోసం తల్లీ, చెల్లిని కోర్టుకు కూడా లాగేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మోసం చేశారంటూ ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో కేసు వేశారు. సెప్టెంబర్ లోనే జగన్ ఈ పిటిషన్ వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చే నెలలో విచారణ జరగనుంది. తల్లి, చెల్లిపై ప్రతీకార జ్వాలతో రిగిపోతున్న జగన్ తీరు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో కూడా చర్చనీయాంశమవుతోంది.
అసలు వివాదం సరస్వతి కంపెనీ షేర్లు
వైఎస్ అధికరారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి పేపర్ల మీద సరస్వతి పవర్ అనే కంపెనీని పెట్టారు. ఆ పేరుతో పల్నాడులో పరిశ్రమలు పెడతామని ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున తక్కువ మొత్తానికి భూములు కొనుగోలు చేశారు. ఆ కంపెనీలో షేర్లను తన తల్లి, చెల్లి పేరిట కూడా కొన్ని కేటాయించారు. కంపెనీ పెట్టినప్పుడే ఇదంతా జరిగింది. అయితే ఇటీవల ఆయన తన తల్లికి ఇచ్చిన షేర్లను అక్రమంగా తన చెల్లికి బదలాయించిందని ఇది తనకు ఇష్టం లేదని.. తన షేర్లు తనకు ఇచ్చేయాలని ఆయన ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ పిటిషన్లో జగన్ భార్య భారతి కూడా సహ పిటిషనర్ గా ఉన్నారు. అంటే భార్య, భర్త ఇద్దరూ కలిసి విజయమ్మ, షర్మిలను కోర్టుకు లాగుతున్నారు.
అసలు కంపెనీ ఉంది పేపర్ల మీదనే !
సరస్వతి పవర్ అనేది పేపర్ల మీదనే ఉంది. ఆ కంపెనీ పేరు మీద భూములు తప్ప ఉత్పత్తి, ఆదాయం లేవు. ఆ భూములు కారుచౌకగా కొట్టేసినవి. ఆ కంపెనీని తాము చాలా వృద్ధిలోకి తెచ్చామని జగన్, భారతి పిటిషన్లో చెప్పుకున్నారు. ఆయన చేసిన వృద్ధి ఏమిటంటే… సీఎం గా ఉన్నప్పుడు నీళ్లు, గనులు కేటాయించుకోవడం. అదే గొప్ప అభివృద్ధి. ఇప్పటికీ భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించకపోవడంపై వివాదం ఉంది.
రాజకీయంగా వాడుకుని తల్లి, చెల్లిని కోర్టుకు లాగుతారా ?
వైఎస్ చనిపోయిన తరవాత జగన్ తన రాజకీయ భవిష్యత్ కోసం తల్లిని రోడ్డుపైకి ఎక్కించారు. ఆమెను గౌరవాధ్యక్షురాలిగా చేసి… అసెంబ్లీకి పంపి అందరితో నానా మాటలనిపించారు. తర్వాత ప్రచారం చేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక చిన్న పదవి కూడా ఇవ్వలేదు., చెల్లి షర్మిల ఆయన కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ ను అరెస్టు చేసినప్పుడు అందరూ రోడ్డున పడ్డారు. అయినా జగన్ .. అప్పనంగా వచ్చిన ఆస్తులను కూడా పంచడానికి మనసు రాక కోర్టుకు లాగుతున్నారు.