జగన్ రెడ్డి విజయవాడలో స్కిట్ చేసి చంద్రబాబు సీఎంగా ఫెయిలయ్యారని గొంతు చించుకున్నారు. ముందుగానే సెటప్ వేసుకుని ఎంపిక చేసిన వారిని తీసుకొచ్చి మాట్లాడి.. రికార్డు చేసుకుని మీడియాలో చూపించుకునేందుకు ఆ షూట్ చేశారు. అలాగే టై అప్ ఉన్న ఇండియా టుడే రిపోర్టర్ ని కూడా పిలిపించుకుని… ఆయన చేసిన విజ్ఞాన ప్రదర్శన కూడా వైరల్ అవుతోంది. జగన్ చాలా చెప్పారు. అసలు వరద హెచ్చరికలు వచ్చినప్పటి నుండే ప్రభుత్వం ఏం చేయాలో ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన హావభావాలు.. నిలబడి రోడ్డు మీద చేసిన యాక్షన్ చూసి… కడుపులో ఇంత మంట ఉందా అనుకుంటారు ఎవరైనా .
మరి సీఎంగా ఐదేళ్లున్నావు కదా ఇవన్నీ ఏమయ్యాయి అంటే.. ఆయన దగ్గర సమాధానం ఉండదు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని..తాము ఎన్నో సార్లు అలర్ట్ చేసినా స్పందించలేదని కేంద్రం .. పార్లమెంట్లో రికార్డెడ్‌గా చెప్పింది. రాయలసీమ వరదలు విజయవాడ తరహాలో వాగు పొంగితే వచ్చినవి కావు. వారం పాటు కురిసిన వర్షాల వల్ల వచ్చినవి. ఎందుకు డ్యామ్ గేట్లు ఓపెన్ చేయలేదు..? అంటే సమాధానం ఉండదు. వైసీపీ హయాంలో కరోనా సహా ఏ విపత్తు వచ్చినా పోయిన వాళ్లు పోతారు.. ఉన్న వాళ్లను కాపాడమని ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అసలు జగనే ఐదేళ్ల పాటు బయటకు రాలేదు. ఇప్పుడొచ్చి విజయవాడ రోడ్లపై స్కిట్స్ ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి ప రిస్థితుల్లో జగన్ అధికారంలో ఉంటే… విజయవాడ వాసుల కష్టాలు ఎలా ఉండేవో ఊహించుకుంటే అక్కడి ప్రజలకు వణుకు వచ్చేస్తుంది. టీడీపీ హయాంలో చేపట్టిన భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ బూడిద పాలు చేసింది జగన్. చివరికి బుడమేరు పాపం జగన్ దే. వైసీపీ నేతలు బుడమేరను ప్లాట్లుగా చేసి అమ్ముకుంది ఎంత నిజమే… టీడీపీ హయాంలో బుడమేరు ఆధునికీకరణకు ఇచ్చిన ఇచ్చిన నిధుల్ని కూడా కొల్లగొట్టింది అంతే నిజం. అసలు బుడమేరు ఉందా లేదా అన్నట్లుగా మార్చారు. ఐదేళ్ల జగన్ పాలన అనర్థాలు ప్రజల్ని మరో ఇరవై ఏళ్లు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఏపీ పునాదుల్నే పీకి పడేసిన పాలన అది.