వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట.. విశాఖలో పార్టీ ముఖ్య నేతలందరి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక మాట చెప్పడానికే ఏర్పాటు చేసినట్లు.. జనవరిలో ఎన్నికలొస్తాయి అందరూ రెడీ ఉండండి అని సందేశం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జనవరిలోనే రావొచ్చు.. దానికి ఆంధ్రప్రదేశ్ నేతలమైన … మనం ఎందుకు సన్నద్ధం కావాలని… వైసీపీ నేతలు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. వైసీపీ నేతల్లో ఆ గందరగోళం అలా ఉండగానే… మళ్లీ నిన్న విశాఖలో అవే వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కాస్తంత క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీకే.. జనవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చారు. కానీ ఇందులోనూ బోలెడంత కన్ఫ్యూజన్ వైసీపీ నేతలకు వచ్చి పడింది. ఏపీ అసెంబ్లీకి జనవరిలో ఎన్నికలు రావాలని జగన్ కోరుకుంటే ఎలా వస్తాయబ్బా..? అనేదే ఆ కన్ఫ్యూజన్. చంద్రబాబు కోరుకంటే వస్తాయి కానీ.. జగన్ కోరుకుంటే రావని.. ఎవరైనా సలహాదారులు… చెబితే బాగుండని.. మనసులో అనుకుని ఉంటారు.
కానీ విచిత్రంగా.. జగన్ మాటలు.. చాలా విశ్వసనీయంగా కనిపించాయేమో.. కానీ… ఆర్నాబ్ గోస్వామి … వెంటనే.. తన టీవీ చానల్లో వేసేసుకున్నారు. ఎవరో అభిప్రాయం వ్యక్తం చేశారని.. చెప్పి చంద్రబాబు ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నారని ప్రసారం చేసుకున్నారు. గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లుగా.. గొప్పగా చెప్పుకున్నారు. అక్కడ కూడా ఆర్నాబ్ గోస్వామి లాజిక్ మిస్సయ్యాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఇప్పటికే పదుల సార్లు క్లారిటీ ఇచ్చారు.. ముందస్తు జరిగే ప్రశ్నే లేదని. దాంతో.. పాటు ఆయన ఎలాంటి ఎన్నికల సన్నాహాలు కూడా చేయడం లేదు. కేసీఆర్ చేసినట్లు.. ముందస్తు వరాలతో పాటు.. ప్రతిపక్షానికి సవాళ్లు కూడా చేయడం లేదు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు కాబట్టి.. దాని ప్రకారం ఫాలో అయిపోతున్నానని చెబుతున్నారు.
ఇటు జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ముందస్తుకు వెళ్లబోతున్నారని.. తనంతట తాను ప్రచారం ప్రారంభించడం.. దాన్ని మోడీ జేబులో చానల్ లాంటి.. రిపబ్లిక్ టీవీ, ఆర్నాబ్ గోస్వామి.. గొప్ప బ్రేకింగ్‌గా వేసి ప్రసారం చేయడం వెనుక రాజకీయ గూడు పుఠాణి ఉందన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో.. టీడీపీ విషయంలో ఆర్నాబ్ తెగ ఇదైపోతున్నారు. రమణదీక్షితుల ఇష్యూలో.. ఓ సందర్భంలో… రోజంతా.. ఇష్యూ చేసి.. టీటీడీ చేత నోటీసులు కూడా అందుకున్నారు. బీజేపీకి సంబంధించిన ఓ మిషన్ ప్రకారం.. ఆర్నాబ్ చానల్ పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చానల్ ఏపీలో ముందస్తు అంటూ ప్రచారం చేయడం వెనుక మైండ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. మంత్రి సోమిరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి జగన్.. మరో కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారు. నిజమేమిటో త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.