నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా కానీ మీరు మాత్రం ఎక్కడికో వెళ్తామంటున్నారు.. అన్న డైలాగ్ ను జగన్ రిపీట్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా.. ఎవర్ని చూసినా కులం తప్ప మరో అంశం జగన్ మైండ్ లోకి రాదేమో కానీ.. విజయవాడ జైలు నుుందు నిలబడి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సామాజికవర్గం నుంచి ఎదురుగుతున్న వల్లభనేని వంశీని తొక్కేయాలని చంద్రబాబు, లోకష్ అరెస్టు చేయించారని అంటున్నారు. తన సామాజికవర్గం అని ప్రోత్సహిస్తున్నారు అని ఎప్పుడూ చెప్పే జగన్ ఈఈ సారి తొక్కేసేందుకు అని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.
ఒక వేళ ఆయనపై కేసులు పెట్టకపోతే.. అరెస్టు చేయకపోతే జగన్ రెడ్డి ఆయనను సీఎం చేసి ఉండేవారా అన్న సెటైర్లు అక్కడే వినిపించాయి. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవాడు. రాజకీయ విమర్శలు చేసినా పద్దతిగానే చేసేవాడు. నియోజకవర్గంలో ఏదైనా తప్పుడు పని చేయాలన్నా చంద్రబాబు, లోకేష్ ప్రశ్నిస్తారని భయపడేవారు. కానీ వైసీపీలో చేరిన తర్వాత ఆయన అందరిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుని అందరికీ కాని వారయ్యాడు. ఇప్పుడు ఆయన కు వైసీపీ నేతల సపోర్టు కూడా లేదన్నది బహిరంగరహస్యం. వదిలేశారు అంటారని.. కంటి తుడుపు పరామర్శలు చేస్తున్నారు.
పరిటాల రవి అనుచరుడనే గౌరవం అయనకు గతంలో టీడీపీ కార్యకర్తల్లో అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు వంశీని ఎవరికీ కాకుండా చేసింది జగన్. మళ్లీ ఆయనే ఎదురుగుతున్నారని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అంటున్నారు. కనీసం అపాయింట్లు కూడా ఇవ్వరని రోజులు ఆయనకు గుర్తు లేవేమో కానీ.. సర్వం కోల్పోయి జైల్లోపడిన వంశీ.. ఎన్ని రోజులకు బయటకు వస్తాడో తెలియక ఆయన కుటుంబసభ్యులు కూడా మథనపడే పరిస్థితి కనిపిస్తోంది.