ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ ప్రజాభిప్రాయం కోరేందుకు వెళ్లే ముందు ఏం చెప్పాము.. ఏం చేశాము.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ. కానీ జగన్ రెడ్డి స్టైలే వేరు. తాను కృష్ణుడ్ని, అర్జునుడ్ని..అభిమన్యుడ్ని అని చెప్పుకుంటూ.. శిలువ గుర్తులో వేసిన ర్యాంప్ మీద నడుస్తూ.. సినిమా స్క్రిప్ట్ రైటర్లు రాసిన డైలాగుల్ని చదివి వెళ్లారు. ఈ స్పీచ్ లో ఓ విధి లేదు.. ఓ విధానం లేదు.. ఓ విజన్ లేదు. అన్నింటికి మించి… జగన్ రెడ్డి సైకోతనం మొత్తం వెలుగులోకి వచ్చేలా సభ జరిగింది.
చిన్న పాటి వైఎస్ బొమ్మ కూడా ఎక్కడా కనిపించలేదు !
జగన్ రెడ్డి పాత్రధారి తాను వైఎస్ కుమారుడ్నని యాత్ర సినిమా ట్రైలర్ లో చెప్పుకుంటూ కనిపించారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి మనసు మార్చుకున్నారు.. వైఎస్ ఎవడ్రా అన్న సినిమా డైలాగ్ తరహాలో ఆయనను స్మరించుకోవడమే మర్చిపోయారు. వైఎస్ ప్రస్తావన స్పీచుల్లో లేకపోగా.. భీమిలిలో నిర్వహించిన సభా ప్రాంగణంలో ఒక్క చోట కూడా వైఎస్ ఫోటో కనిపించలేదు. ఫ్లెక్సీల్లో కూడా వైఎస్ ఫోటో కనిపించలేదు. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా… తమ నేతలకు అహంకారం .. తండ్రిని కూడా కాదనుకునే స్థాయికి చేరిపోయిందన్న అభిప్రాయానికి వచ్చారు.
తానొక్కడే.. స్థానిక నేతల ఫోటోలకూ దిక్కులేని పరిస్థితి !
ప్రచారం.. ఫ్లెక్సీలు.. ఫోటోలు.. కటౌట్లు .. ఏదైనా తాను ఒక్కడే. అదే జగన్ రెడ్డి స్టైల్. ప్రజాస్వామ్యంలో జగన్ రెడ్డి తనను తాను రాజుగా ఫీలవుతున్నారు. ప్రజలందరూ తనను వ్యక్తి పూజ చేయాలనుకుంటున్నారు. ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఒక్కడే అంతా చేస్తున్నాడా.. పార్టీలో ఇంకెవరూ ఏమీ చేయడం లేదా అని ప్రశ్నించుకుంటున్నారు. ఈ గర్వానికి అంతం ఎంతో దూరం లేదన్న సెటైర్లు కూడా వారే వేస్తున్నారు.
మూడు రాజధానుల ప్రస్తావనకూ భయపడిన వైనం
మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేసి.. పబ్బం గడుపుకోవాలనుకున్నారు కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. మూడు రాజధానుల గురించి మాట్లాడితే ఎలా ఉంటుదో ఆయనకు తెలుసు. ఉత్తరాంధ్రను దోచుకున్నదంతా ప్రజల కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే జగన్ రెడ్డి పూర్తిగా తనపైకి అందరూ కలిసి వస్తున్నారని చెప్పుకుని జాలి పడండి మహా ప్రభో అని వేడుకుంటున్నట్లుగా సభ పెట్టారు కానీ.. అసలు ప్రజల మూడ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
సైకో తనం ప్రత్యక్షం !
అసలు సభ ముందు ప్రతిపక్ష నేతల పోస్టర్లు పెట్టి.. వాటి ముందు పంచింగ్ బ్యాగులు పెట్టాలన్న ఆలోచన జగన్ రెడ్డికి ఎలా వచ్చిందో కానీ.. ఆయన చీప్ మెంటాలిటీని మాత్రం ప్రజల ముందు పెట్టింది. రేపు గన్నులు చేతికి ఇచ్చి ఆ కటౌట్లను కాల్చమని కూడా చెప్పే అవకాశం ఉంది. గతంలో అదే అన్నారు. . చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదన్నారు. ప్రజలు ఇలాంటి మనస్థత్వాన్ని చూసి భయపడిపోతున్నారు. సైకోల్ని తయారు చేస్తున్న జగన్ రెడ్డి మరోసారి గెలిస్తే ఏపీలో ఎవరికీ భద్రత ఉండదు.
మొత్తంగా జగన్ రెడ్డి మొదటి ప్రచారసభలో దివాలా స్థితికి తమ పార్టీ చేరుకుందని నిరూపించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంత ఫేక్ ప్రచారం చేసుకున్నా… జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చింది.