ప్రజలు ఇచ్చిన ఓటమితో మైండ్ బ్లాంక్ అయిన జగన్ ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. సలహాదారులు చెప్పడం లేదో.. ఆయన వినడం లేదో కానీ పరువు పొగొట్టుకునేందుకు జనంలో కామెడీ పీస్‌గా మరింత ప్రాచుర్యం తెచ్చుకునేందుకు పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసెంబ్లీలో తన పార్టీ ఒక్కటే విపక్షంలో ఉందని తనకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్ లో కోరారు.
జగన్ పిటిషన్ చూస్తే రాజ్యాంగం గురంచి కనీస అవగాహన ఉన్న వారు భళ్లున నవ్వుతారు. ఎందుకంటే.. స్పీకర్‌ను ఏ కోర్టులూ ఆదేశించలేవు. ముఖ్యంగా సభా వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోర్టు ఆదేశించినా.. స్పీకర్ పాటించాల్సిన అవసరం లేదని.. శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదనేది చాలా సార్లు తేలిన విషయం.
Also Read : కేంద్ర బడ్జెట్ పై వైసీపీ సైలెన్స్ ..ఎందుకు?
అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదని జగన్ ఇంతకు ముందు స్పీకర్‌కు లేఖ రాశారు. మామూలుగా అయితే పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నారంటేనే.. నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సిన సీట్లు రాలేదని అర్థం అవుతుందని.. అలాంటి రూల్ లేనప్పుడు అడగాల్సిన అవసరం ఏముంది. ఆయనే ప్రతిపక్ష నేత అవుతారుగా.
2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పది శాతం సీట్లు రాలేదు. అందుకే ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గానే పార్లమెంట్ లో ఆ పార్టీ నేత వ్యవహరించారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ అనుకూల తీర్పు రాకపోవడంతో మరోసారి ఆ టాపిక్ ఎత్తలేదు. ఇవన్నీ తెలిసినా జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.