వైఎస్ వివేకా హత్య కేసులో… వైఎస్ జగన్మోహన్ రెడ్డి… పడుతున్న కంగారు అంతా.. ఆయన కోర్టుల్లో దాఖలు చేస్తున్న పిటిషన్లలో బయట పడుతోంది. వివేకా హత్య విషయాన్ని పకడ్బందీగా గుండెపోటుగా.. మార్చాలనుకున్నా… చివరికి బయటపడిపోవడంతో.. మరుక్షణం.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, కడప నేత ఆదినారాయణరెడ్డిలపై ఆరోపణలు చేసేసి.. కవర్ చేసుకున్న వైసీపీ నేతలు… ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముందుకు సాగే కొద్దీ .. అంతకు అంత టెన్షన్ పడుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తే… ఏదో అయిపోతుందన్న ఫీలింగ్‌కి వచ్చి ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలంటూ.. కోర్టులకు వెళ్లారు. దీనిపై వాదనలు జరుగుతూండగానే.. జగన్మోహన్ రెడ్డి… సిట్ విచారణ వివరాలు మీడియాకు చెప్పకుండా.. ఆపాలంటూ… మరో పిటిషన్ వేశారు.
జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ చూసి.. న్యాయవర్గాలు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఓ నేరం జరిగినప్పుడు.. అది సంచలనాత్మకం అయినప్పుడు.. దానికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలని.. వివరాలు పోలీసులు బయట పెట్టకుండా చూడాలనే… పిటిషన్ ఇంత వరకూ… ఎవరూ దాఖలు చేసి ఉండని.. న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసన్నట్లుగా.. ఆ వివరాలు బయట పెడితే.. తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని… భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే.. ఆయన మీడియాకు వివరాలను పోలింగ్ అయిపోయే వరకూ వెల్లడించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ హత్య కేసు దర్యాప్తునకు.. పోలింగ్‌కు సంబంధం ఏం ఉంటుంది..?
జగన్మోహన్ రెడ్డి పిటిషన్… న్యాయస్థానానికి కూడా వింతగా అనిపించినట్లుగా ఉంది. అందుకే.. ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరంచలేదు. ఈ విషయంలో పోలీసులపై ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. నిజానికి… సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది. దాదాపుగా.. ఎవరు నిందితులు.. అన్నదానిపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అత్యంత సున్నితమైన కేసు కాబట్టి.. ఎలాంటి అనుమానాలు రాకుండా.. సాంకేతిక ఆధారాలను కూడా.. బయటకు తీసి.. పక్కాగా బయట పెట్టాలనుకుంటున్నారు. ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎక్కువగా కంగారు పడిపోతున్నారు. ఈ కంగారు వెనుక ఉన్న అర్థం ఏమిటో..?