కోడికత్తితో తనపై దాడి చేయించింది.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని.. వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దాడి ఘటన తర్వాత పాదయాత్ర ప్రారంభించిన ఆరు రోజులకు.. తొలి సారి .. ఓ బహిరంగసభలో మాట్లాడారు. రొటీన్ గా చంద్రబాబుపై పాలనపై … మొదటగా విమర్శలు చేసి.. చివరికి… తనపై జరిగిన దాడి ఘటనను.. హత్యాయత్నంగా చిత్రీకరించుకుని.. కావాల్సినంత సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోకి కత్తులు ఎలా వచ్చాయని.. ప్రశ్నించారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబు మనిషేనని అందులో పనిచేసే మనిషే కత్తితో దాడి చేశారని జగన్ ఆరోపించారు.
హత్యాయత్నం జరిగిన గంట కాక ముందే డీజీపీ, హోంమంత్రి మీడియా ముందుకొచ్చారు..హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమానంటూ తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు. నేను మెరుగైన పాలన చేయాలని కోరుకునే వ్యక్తి నాపై ఎలా హత్యాయత్నం చేస్తారని సందేహం వ్యక్తం చేశారు.
జగన్ అభిమాని అంటూ ఓ ఫ్లెక్సీ విడుదల చేశారు … ఫ్లెక్సీలో వైఎస్ ఫొటో లేదు..గరుడపక్షి ఫొటో ఉంది … ఘటన జరిగిన గంటలోనే ఫ్లెక్సీని విడుదల చేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి దాడి చేసిన వ్యక్తి జేబులో ఎలాంటి దొరకలేదని.. 10 గంటల తర్వాత డీజీపీ ఓ లేఖ విడుదల చేశారన్నారు. రెండు మూడు రకాల చేతి రాతతో ఆ లెటర్ ఉందని… ఆ లెటర్‌కు మడతలు కూడా లేవు.. ఇస్త్రీ చేసినట్టుగా ఆ లెటర్ ఉందని చెప్పుకొచ్చారు.
ఎయిర్‌పోర్టులో మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఎయిర్ పోర్టు అధికారులు కోర్టుకు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే.. ఈ ఎయిర్ పోర్టు అధికారుల్ని… జగన్ చంద్రబాబు మనుషులుగా చెప్పుకొచ్చారు. ఇది కుట్ర కనబడడం లేదా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.
అమ్మ, చెల్లిపై కుట్ర నెపం నెడుతున్నారురని.. ఇంతగా దిగజారిపోయిన చంద్రబాబు అసలు మనిషేనా? అని జగన్ ప్రశ్నించారు. అంబాడాలు వేయకూడాదని హత్యాయత్నం జరిగిన వెంటనే నేను మాట్లాడలేదని… అప్పటికప్పుడు చొక్కా మార్చుకొని బయలుదేరానన్నారు. ఎవరూ కంగారుపడొద్దని ట్వీట్ చేయమని నేనే చెప్పానన్నారు. మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ వెళ్లానని వివరణ ఇచ్చారు. నాపై హత్యాయత్నం చేయించకపోతే.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టవద్దని.. జారీ చేసిన జీవో కూడా… తనపై జరిగిన దాడి గురించేననిచెప్పుకున్నారు. సీబీఐ విచారణ జరిగితే జైలుకు పోతావని చంద్రబాబు వణికిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేస్తున్నా నా సంకల్పం ఆగదని .. చివరి రక్తపు బొట్టు ఉన్నంత ప్రజల కోసం తపిస్తానని చివరిోల ఫనిషింగ్ టచ్ ఇచ్చారు.