నవ్యాంధ్ర రెండో ప్రభుత్వం… తొలి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు.. సంక్షేమ పరంగా చూస్తే.. ఓ విప్లవంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వం లక్ష్యం.. ప్రజల బాగోగులు చూసుకోవడమే. ఆ కోణంలో చూస్తే… వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మొదటి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మైలురాళ్లుగా మిగిలిపోతాయి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుని అయినా సరే.. ప్రజలకు చేయాలనుకున్నవి చేయాలన్న పట్టుదల .. కొత్త సీఎం నిర్ణయాల్ోల కనిపించింది.
వడ్డీ లేని రుణాలు..! రైతు సంక్షేమంలో చారిత్రత్మక అడుగులు..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి… రెండో సారి గెలిచిన సందర్భంలో రైతులకే ప్రముఖపాత్ర. అప్పట్లో రుణమాఫీ జరిగింది. అంతే కాదు.. వైఎస్ఆర్ రైతులకు కొన్ని ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టి వారి మనసులు గెలుచుకున్నారు. వాటిలో ఉచిత విద్యుత్ ఒకటి. రెండో సారి గెలిచినప్పుడు.. ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను తొమ్మిది గంటలు చేస్తామన్నారు. ఇప్పుడు.. వైఎస్ జగన్ కూడా… తండ్రి అడుగుజాడల్లో కాదు.. ఇంకా ఓ అడుగు ముందే వేశారని చెప్పుకోవచ్చు. రైతులకు వడ్డీ లేని రుణాలివ్వడం అంటే.. ఓ రకంగా సంచనాత్మక నిర్ణయం. ఏపీలో… ప్రతి ఏడాది రైతులకు…ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి.. దాదాపుగా రూ. అరవై వేల కోట్ల వరకూ రుణాలు ఇస్తూ ఉంటాయి. ఇంత పెద్ద మొత్తంపై.. వడ్డీ భారం భరించడం అంటే.. సాహసోపేతమైన నిర్ణయమే. నిజానికి.. రూ.లక్ష వరకూ రుణం తీసుకునే రైతులకు వడ్డీ లేని రుణ పథకం ఇప్పటికే అమల్లో ఉంది. అలాగే రూ.లక్ష నుంచి 3 లక్షల రుణం పొందే వారికి పావలా వడ్డీ పథకం కింద రుణాలిస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం ఏటా రూ. 200 కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఇప్పుడు జగన్.. ఈ పరిమితులు తీసేయనున్నట్లుగా కేబినెట్ నిర్ణయాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు.
రైతుకు భరోసా ఇస్తున్న జగన్..!
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో…. ప్రతి రైతుకు రూ. 12,500 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏపీలో దాదాపుగా యాభై లక్షల మంది రైతులు ఉన్నారు. అందరికీ సాయం చేస్తే.. వ్యవసాయదారులకు ఎంతో మేలు చేసినట్లే. పెట్టుబడి వస్తే.. రైతులు మరింత ధీమాగా పంటలను సాగు చేస్తారు. అదే సమయంలో.. ఉచిత బోర్లు… ధరల స్థిరీకరణ నిధి, విపత్తల నిధి పేరుతో…జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ అమలై… రైతులకు మేలు జరిగిననాడు.. జగన్ వారికి ఆరాధ్యుడవుతాడు.
ఉద్యోగులకు అడిగినంత సాయం.. కోరినంత ఫలం..!
ఉద్యోగులు సంతృప్తిగా ఉంటేనే… ప్రభుత్వం సజావుగా నడుస్తుంది. వారు అసంతృప్తికి గురయితే.. నిరసనలు ఆందోళనలతో పాలన స్తంచిపోతుంది. ఇలాంటి పరిస్థితిని జగన్ అసలు కోరుకోలేదు. అందుకే.. తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను… ఉన్న పళంగా నెరవేర్చడానికి ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయలేదు. 27 శాతం ఐఆర్ ఇవ్వడమేకాదు… ఉద్యోగుల సుదీర్ఘ కాల డిమాండ్ అయిన… సీపీఎస్ రద్దు కోసం చర్యలు ప్రారంభించారు. జగన్ చేయాలనుకుంటే చేస్తారు కాబట్టి.. ఎంత ఆర్థిక భారమైనా.. సీపీఎస్‌ను రద్దు చేయిస్తారు. అందుకే ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు.
ఆర్టీసీ విలీనం అసాధ్యమన్న టీడీపీ.. చేసి చూపిస్తున్న జగన్..!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం చారిత్రత్మకమే కాదు.. రాజకీయంగా కూడా.. ఓ ఘనవిజయమే. ఎదుకంటే.. గత ప్రభుత్వం ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని తేల్చింది. కానీ జగన్ మాత్రం దాన్ని చేసి చూపించబోతున్నారు. మూడు నెలల్లో … ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది.
ఇవి మాత్రమే… కాదు… సకల వర్గాలకు మేలు చేసే ఎన్నో… సంక్షేమ పథకాలను మెరుగుపర్చడానికి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయాలు తీసుకుంది. చిరు ఉద్యోగుల జీతాలను అమాంతం పెంచేశారు. ఇవన్నీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆ ఫలాలు ప్రజలకు అందినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో ఉండిపోతారనడంలో సందేహం లేదు.