ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన పాలనతో దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులను ఏడాది పాటు సంపూర్ణంగా అధ్యయనం చేసిన స్కోచ్ అనే సంస్థ… ఆయనను సీఎం ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించాలని డిసైడయింది.దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలను జగన్ చేశారని.. తెలుసుకుంది. ఆ మేరకు ప్రకటన చేసింది. అవార్డును స్కోచ్ సంస్థ చైర్మన్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి అందచేశారు. సీఎం జగన్ ఆ పురస్కారానికి చిరునవ్వుతో స్వాగతించారు. తమ కష్టాన్ని గుర్తించిన స్కోచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
స్కోచ్ అనే సంస్థ అవార్డులు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలకు అవార్డులు ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకూ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును మాత్రం ప్రకటించలేదు. దీనికి కారణం ఏడాది మొత్తం సీఎం పనితీరును మదింపు చేయాల్సి ఉండటమే. ఆ కసరత్తును సుదీర్ఘంగా నిర్వహించిన స్కోచ్ పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లుగా తేల్చింది. ఏపీలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా స్కోచ్ అధ్యయనం చేసింది. రైతు భరోసా కేంద్రాలు, చేయూత, అనుసంధాన రుణాలు వంటివి ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెస్తున్నాయని స్కోచ్ చెబుతోంది. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని స్కోచ్ ప్రకటించింది.
కరోనా నియంత్రణలో ఏపీ సర్కార్ ఆదర్శంగా నిలిచింది. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే స్కోచ్ సంస్థకు ఇంటికి వచ్చి మరీ అవరా్డును ఇవ్వాలని నిర్ణయించుకుంది. సాధారణంగా స్కోచ్ సంస్థ ఢిల్లీలో పెద్ద పెద్ద కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఈ సారి మాత్రం అవార్డులు పొందిన వారికి ఇంటికి వెళ్లి ఇస్తూ వస్తున్నారు.కొద్ది రోజుల క్రితం.. ఇండియా టుడే నిర్వహించినఅప్రూల్ రేటింగ్స్ పోల్‌లో సీఎం జగన్ స్థానం 33శాతానికి తక్కువకు పడిపోయింది.కానీ స్కోచ్లో మాత్రం బెస్ట్ సీఎం అవార్డు రావడం వైసీపీ నేతల్ని ఆనంద పరుస్తోంది.