హలోకేషన్ పాలిటిక్స్ .. అంటే ఎవరు ఎలా ఉన్నా..తన చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా.. తాను అనుకున్నట్లుగానే ఉందని ఊహించుకుంటూ చేసే రాజకీయం హలోకేషన్ పాలిటిక్స్. ఇలాంటి దుస్థితిలోకి దిగజారిపోవాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు అనుకోరు. కానీ ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలనుకునే రాజకీయ నేత జగన్ రెడ్డి. ఆయనకు ఎవరూ చెప్పడం లేదో.. ఆయన మానసిక స్థితి తెలుసు కాబట్టి ఆయనను ఆ లోకంలోనే ఉంచి పార్టీ నేతలు, ఆయన చుట్టూ ఉన్నవారు పబ్బం గడుపుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాద్షాలో బ్రహ్మానందం తరహాలో జగన్ రాజకీయం
బాద్ షా సినిమాలో బ్రహ్మానందం పోలీస్ ఆఫీసర్. ఆయనను ఓ లోకంలో ఉంచేసి అన్ని పనులు చేసేస్తూంటారు హీరో.. ఇతర బృందం. అచ్చంగా ఇక్కడ జగన్ ను కూడా అదో లోకంలో ఉంచేసి.. మిగతా పనులు చేసేస్తున్నట్లుగా ఉన్నారు ఆయన చుట్టూ ఉన్నవారు. ఏపీలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని ప్రచారం చేయడం.. చిన్న చిన్న గొడవలతో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం.. ప్రజావ్యతిరేకత పెరిగిపోతోందని ఊహించుకోవడం.. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టడం లేదని అనకోవడం.. చూస్తూంటే.. జగన్మోహన్ రెడ్డిని ఆయన వంది మాగధులు అదో లోకంలో ఉంచుతున్నారన్న అనుమానం ఎవరికైనా వస్తుంది.
సాక్షి పత్రిక చూసి అదే నిజమనుకుంటున్నారా ?
జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక ఒక్కటే చూస్తున్నారో.. లేకపోతే జనమంతా తమ పత్రికను మాత్రమే చూస్తారని అనుకుంటున్నారో కానీ..అవే మాటలు చెబుతున్నారు. జనానికి కళ్ల ముందు కనిపించే విషాయలను కూడా ఫేక్ చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. బహుశా జగన్ కు ఇష్టం ఏమో.. అలా చూపించకపోతే ఆయన ఫీలవుతారని అలా అచ్చేస్తున్నారేమో .. వాటిని జగన్ కూడా నిమేనని నమ్ముతున్నారని అందకే అలా మాట్లాడుతూంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇలా మాయా ప్రపంచంలో బతకబట్టే కదా ఈ దుస్థితి
జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన మొత్తంలో నిజాలను తెలుసుకోకుండా మాయ ప్రపంచంలో బతబట్టే ఈ దుస్థితి వచ్చిందని పార్టీ క్యాడర్ గొణుక్కుంటున్నారు. తాను అకౌంట్లలో డబ్బులేస్తున్నాను కాబట్టి.. జనమంతా తన వెంట వచ్చి ఓట్లేస్తారని ఆయన అనుకున్నారు. ఆయన వంది మాగధులు, సలహాదారులు.. చుట్టుపక్కల చేరిన భజన పరులు అదే చేశారు. కానీ తము బిచ్చగాళ్లం కాదని జనం నిరూపించారు. ఇప్పిటికైనా వాస్తవ పరిస్థితుల్ని జగన్ అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సింది.కానీ ఆ పని మాత్రం చేయడం లేదు.