అతి మంచితనం.. అతి నిజాయితి అని సాక్షి పేపర్లో రాయించుకుని పార్టీ నేతలతో ప్రచారం చేయించుకుంటున్నారు జగన్. కానీ సామాన్యుల అభిప్రాయం ఏమిటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ వ్యవహారాన్ని కుటుంబ గుమ్మం దాటి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఆయన ఎప్పుడు ప్రజాభిప్రాయంతో పని పెట్టుకోలేదు. తాను నేరేట్ చేస్తా. సాక్షి ప్రచురిస్తుంది. అదే జనం చదువుతారు. అదే నిజమని భావనలో ఆయన ఉండిపోయారు. ఫలితాల్లో పాతాళానికి పడిపోయినా అదే భావనలో ఉన్నారు.
మూర్ఖంగా జగన్ మనస్థత్వం
నేను జైలుకెళ్లాను కాబట్టి అందరనీ జైలుకు పంపాలని మూర్ఖంగా ఆలోచించే మనస్థత్వం జగన్ ది. చిన్న పిల్లలు ఎంత మూర్ఖంగా కక్షసాధింపుల కోసం ఆలోచిస్తారో అలా ఆలోచిస్తారు. దాని వల్ల ఏంటి ఉపయోగం అనే ఆలోచన కూడా ఉండదు. ఎవరైనా అంతే. చెల్లిపైనా అంతే. ఇలాంటి మనస్థత్వం ఉండి కనీస ఆలోచన లేని ఆయనను రాజకీయ ప్రత్యర్థులు ఈజీగా ట్రాప్ చేయగలుగుతారు. అధికారంలో ఉన్నంత కాలం తాను కక్ష సాధించానని ఆయన అనుకున్నారేమో కానీ… ఆయనను తప్పులు చేసేలా టీడీపీ నేతలే ప్రోత్సహించారు. ఆ రాజకీయం ఇంకా అర్థం కాలేదు.
జగన్ పునాదుల్ని కదిలించేలా షర్మిల ప్లాన్
జగన్ కోసం చెల్లి షర్మిల ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు. జగన్ మర్చిపోయినంత ఈజీగా ప్రజలు మర్చిపోరు. పైగా ఇప్పుడు షర్మిల రాజకీయాల్లో ఉన్నారు. ఆమె సెంటిమెంట్ పండిస్తున్నారు. జగన్ కోసం .. వైసీపీ కోసం తాను ఎంత కష్టపడ్డానో చెబుతున్నారు. జగన్ జైలుకెళ్తే పార్టీని నిలబెట్టానని కూడా చెబుతున్నారు. కాస్త ఆలోచిస్తే ఆమెకు రాజకీయంగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు జగన్. మరో అధికార కేంద్రం అవుతుందని పక్కన పెట్టారు. పోనీ ఆస్తి అయినా ఇస్తారని అనుకున్నారు. అది కూడా ఇవ్వకపోయే సరికి రాజకీయాలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ సొంత తల్లి, చెల్లిని కూడా కోర్టుకులాగి ఎవరూ చేయనంత తప్పు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఇలా చేస్తే వారి పతనం చివరి దశకు చేరుకున్నట్లే.
రాజకీయ అజ్ఞాని జగన్
మొత్తం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. సొంత సోదరి తెలివైన రాజకీయం చేస్తోంది. అన్న మోసం చేశాడని ప్రజల్లోకి పంపుతోంది. దానికి జగన్ చేస్తున్న కౌంటర్ .. జగన్ అతి మంచితనం.. అతి నిజాయితీ అంటూ… భాజాభజంత్రీలతో ప్రచారం చేయించుకోవడం. నిజానికి అది జగన్ పై సాక్షి చేసిన ట్రోలింగ్ లాగా ఉంది. ఫ్యాన్స్ కూడా నవ్వుకుంటున్నారు. ఓ వైపు షర్మిల సానుభూతి పెంచుకుంటూంటే జగన్ మాత్రం.. ఇంత కర్కోటకుడా అన్న అభిప్రాయానికి వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇంత అమాయకమైన రాజకీయాలు చేస్తే మరో ఆరు నెలల్లోనే ఆయన ప్లేస్‌లోకి షర్మిల వచ్చినా ఆశ్చర్యం ఉండదు.