ఒక్క సారి ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ?. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా పోరాడుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు జంపింగ్ చేసినా మిగతా వాళ్లను కాపాడుకుని ఫీల్డ్ లోకి వెళ్తోంది. కానీ వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు కనిపించడం లేదు. రోజా చెన్నై నుంచి మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు. అసలు వైసీపీ నెత్తిమీద గుడ్డ వేసేసిన సజ్జల అసలు మీడియా ముందుకు రావడం లేదు. అజ్ఞాతంలో ఉన్న నేతలెవర్నో లెక్కించడం కన్నా.. లేని వాళ్లను లెక్కించడం సులువు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది ?
అధికారం ఉందని మూడు దశాబ్దాలు సీఎంను అని గాల్లో మేడలు కట్టేసుకుని చేసిన అరాచకాల వల్లనే ఈ సమస్య వచ్చింది. జగన్ రెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులు బతకకూడదని ఆయన అనుకుంటారు. తనకు వచ్చిన ప్రతి సమస్యలకూ రాజకీయ ప్రత్యర్థులే కారణం అనుకుంటారు. అందుకే వారిపై కసి తీర్చుకోవాలనుకుంటారు. ఆధారాల్లేని కేసుల్లో అచ్చెన్న సహా ఎంతో మందిని అరెస్టు చేశారు. చంద్రబాబును టార్చర్ చేశారు. మామూలుగా రాజకీయ నేత ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయరు. కానీ అధికారం చేతిలోఉందని ఆయన చేయని అరాచకం లేదు.
ఆయన వికృత మనస్థత్వాన్ని శాటిస్ ఫై చేసి పదవుల్ని పొందడానికి నేతలు చేసిన ప్రయత్నాలతో వారంతా బుక్ అయ్యారు. ఇక దోపిడీలు చేసిన వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. జగన్ రెడ్డి మాములుగా పారిపాలించి ఉంటే.. ఆయన కానీ.. ఆయన పార్టీ నేతలు కానీ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆయన చేసిన నిర్వాకాలు, మానసిక వికృతాన్ని సంతృప్తి పరుచుకునే చర్యలకు అధికారాన్ని వాడటం వల్ల ఇప్పుడు అధికారం పోయాక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లోఉండటానికి.. అనర్హమైన వ్యక్తి అని జగన్ ను అందరూ అనడానికి ఇది కూడా ఓ కారణం.