వైసీపీలో ఇప్పటికీ పరిస్థితి మారడంలేదు. బడుగుల్ని ముందు పెట్టి రెడ్లు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేయడానికి చాలా కొంత మంది నేతల్ని రంగంలోకి దించారు. వీరిలో ఒక్కరంటే ఒక్క రెడ్డి సామాజికవర్గం నేత లేరు. ఫేక్ న్యూస్ బలంగా చెప్పడానికి కూడా కూడా ఇతర కులాల్ని వాడుకుంటున్నారు. టీడీపీ టార్గెట్ చేస్తుందేమోనని.. సొంత వర్గాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.
వైసీపీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ఉన్నారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ ఆయనే. వైసీపీకి శాసనమండలిలో విపక్ష హోదా ఉంది. అక్కడైనా బడుగులకు చాన్సిచ్చారా అంటే… అసాంఘిక శక్తిగా పేరున్న తమ వాడు అయిన అప్పిరెడ్డికి ఆ అవకాశం కల్పించారు. పార్లమెంటరీ పార్టీ నేత గా మిధున్ రెడ్డి.. లోక్ సభ పక్ష నేతగా కూడా ఆయనే ఉంటే.. ఇక రాజ్యసభ పక్ష నేతగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇక పార్టీలో వన్ టు టెన్ కీలక నేతల్ని తీసుకుంటే.. ఒక్కరూ ఇతర వర్గానికి చెందిన వారు ఉండరు.
Read Also : సీఎం రేంజ్ సెక్యూరిటీ కావాలి – హైకోర్టులో జగన్ పిటిషన్
కానీ పార్టీ కోసం డిఫెండ్ చేసేందుకు వైసీపీ ఎంచుకున్న నేతలు మాత్రం రెడ్లు కాదు. రెండున్నరేళ్లకే మంత్రి పదవి నుంచి పీకేసిన పేర్ని నానిని ఫుల్ టైమ్ వాడుకుంటున్నారు. ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి .. తప్పుడు ప్రచారం చేయడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతున్నారు. కలెక్టర్ల సమావేశం ఓ వైపు జరుగుతూండగానే .. సగం సగం కట్ చేసిన వీడియో క్లిప్పులేసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు. ఆయన కాకపోతే అంబటి రాంబాబు.. కాకపోతే అదిమూలపు సురేష్. వీరితోనే ఎక్కువగా రాజకీయం నడిపిస్తున్నారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కోసం జగన్ దిగజారిపోయి సమర్థనలు చేస్తున్నారు కానీ.. అనేక స్కాముల ఆరోపణలు ఎదుర్కొంటున్న.. తమ పార్టీకి చెందిన ఇతర కులాల నేతలను ఆయన సమర్థించడం లేదు. వైసీపీలో ఒకే వర్గానికి ఇప్పటికీ అదే ప్రాధాన్యత కతనిపిస్తోంది.