వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను తీసుకొస్తాం.. అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఐదేళ్లులో ఏం చేశారు ? పూర్తిగా రివర్స్ లో చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అసలు ప్రయత్నించకుండా జరుగుతున్న పనులను కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లను మార్చి మొదటికే మోసం తెచ్చేలా చేశారు. ఆంధ్ర ప్రజలు,రైతులకు పూడ్చుకోలేనంత కష్టం కలిగించారు.
వైఎస్ఆర్ కలలట… అవి కూడా భగ్నం చేసేశారు !
జయలజ్ఞాన్ని వైఎస్ఆర్ కల అని..దాన్ని నిజం చేస్తామని ఆయన రాజకీయ వారసత్వం తనదేనని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. కానీ అందులో ఒక్క శాతం కూడా విజయవంతం కాకపోగా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టుపైనా నిరకంగా దృష్టి పెట్టి పూర్తి చేసిన పాపాన పోలేదు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ప్రయోజనం కల్పించేలా పోలవరం సహా అనేక ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టింది. పట్టిసీమ సహా ఎన్నోప్రాజెక్టులు పూర్తి చేసింది. కానీ జగన్ రెడ్డి సర్కార్ చిన్నప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు.
పోలవరంపై కుట్రలతో ఏపీ జీవనాడిపై చావు దెబ్బ
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు అనేది ఉండదని అందరికీ తెలుసు. శరవేగంగా నిర్మాణం అవుతున్న ప్రాజెక్టును డిస్ట్రర్బ్ చేస్తే.. మొదటికే మోసం వస్తుందని కేంద్రం కూడా హెచ్చరించింది. అయినా వినలేదు. మెఘారెడ్డి ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్ ను మార్చారు. ఎప్పుడైతే కాంట్రాక్టర్ ను మార్చారో అప్పుడే మూలనపడింది. పనులు ఆపేయడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఏడాదిలో పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఐదేళ్ల తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చేతులెత్తేసిన బాపతు. వీరికి పరిపాలించే అర్హత ఉంటుందా ?
కట్టడం కాదు.. కొట్టుకుపోయిన ప్రాజెక్టులు, గేట్లు
ఈ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వం అంటే.. కట్టకపోయినా ఉన్న ప్రాజెక్టుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిందా అంటే అదీ లేదు. ఓ ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనే దరిద్రం అదీ రాయలసీమలో ఈ పాలనలోనే జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇసుక మాఫియా వల్ల.. ప్రభుత్వం నిర్వహణ లోపం వల్లే ఇది జరిగిందని కేంద్రం తేల్చింది. ఇక పులిచిందల.. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే కనీసం పెట్టించలేనంత చేతకాని ప్రభుత్వం ఇది. ఇలాంటి ప్రభుత్వం ఉంటే పోలవరంపై ఆశలు వదిలేసుకోవమే. శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోయినా ప్రజలకు పదివేలిస్తాం.. ఓట్లేస్తారనుకునే భావదారిద్రమైన మనస్థత్వం ఉన్న పాలకులు. ప్రజలు ఆలోచించకపోతే… వారికి జరిగే నష్టాన్ని ఎవరూభర్తీ చేయలేరు.