ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాజధానుల తరలింపు విషయంలో హైకోర్టుకు దొరకకుండా..ఓ మాస్టర్ స్కెచ్ వేశారు. ఎక్కడా రాజధానుల తరలింపు అనే మాట లేకుండా.. పరిపాలనా సౌలభ్యం కోసం.. కార్యాలయాల్ని తరలిస్తున్నామన్న రీతిలో ఆదేశాలిస్తున్నారు. నిన్నటికి నిన్న క్వాసీ జ్యూడిషియల్ విభాగాల తరలింపునకు ఉత్తర్వులు ఇచ్చిన ఆయన.. రేపో మాపో.. విశాఖకు సంబంధించి.. కొన్ని కీలక విభాగాలను తరలించేందుకు.. ఉత్తర్వులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా… పరిపాలనా సౌలభ్యం కోసం.. కొన్ని కార్యాలయాల తరలింపు అని మాత్రమే ఉంటుందంటున్నారు. ఈ పేరుతో.. పరిపాలనా పరమైన విభాగాలన్నింటినీ తరలించడానికి జగన్ రంగం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
ఏది ఏమైనా తాను అమరావతి నుంచి పరిపాలన సాగించకూడదన్న ఆలోచనలో జగన్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో కార్యాలయాల వెదుకులాటలో అధికారులు బిజీగా ఉన్నారు. మిలీనియం టవర్స్‌ను సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఐటీ హిల్స్ లో ఉన్న మరికొన్ని భవనాలను… మరికొన్ని ప్రైవేటు భవనాలను కూడా.. అధికారులు మాట్లాడి పెడుతున్నారు. అంతే కాదు.. ప్లగ్ అండ్ ప్లేగా రెడీ చేసి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు…. అక్కడ్నుంచి పని ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని భావిస్తున్న అమరావతి జెఎసి నేతలు , రైతుల ఉద్యమానికిమ మద్దతు ఇస్తున్న రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వ ఉత్తర్వులపై హై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. కోర్టు స్పందన బట్టి.. కార్యాలయాల తరలింపు ఆగిపోతుందా.. స్పీడప్ అవుతుందా అనేది తేలే అవకాశం ఉంది.