పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చంద్రబాబు క్లాస్ మేట్స్. కాలేజ్లో పెద్దిరెడ్డి, చంద్రబాబును కొట్టాడు. అందుకే ఆయనకు పీకల మీద దాకా కోపం.. ఆయనను టార్గెట్ చేస్తున్నాడు అని.. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. చంద్రబాబు సీఎం అయింది ఇదే మొదటి సారి కాదు.. నాలుగోసారి. పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్నారు. నిజంగా చంద్రబాబుకు అంతగా పాత పగ ఉంటే..పెద్దిరెడ్డిని ఇంత కాలం ఏమీ అనకుండా నాలుగోసారి సీఎం అయిన తర్వాతే పగ తీర్చుకుంటారా ?. పెద్దిరెడ్డి కాంట్రాక్టర్ గా స్థిరపడటానికి చంద్రబాబు సహకరించారని దివాలా తీయకుండా చూశారని చింతామోహన్ లాంటి సీనియర్ చిత్తూరు నేతలు తరచూ మీడియాతో చెబుతూంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎప్పుడో యాభై, ఆరవై ఏళ్ల కింద వాళ్లు కొట్టుకున్నారన్న ధీరీ తీసుకు వచ్చారు.
ఇలా చెప్పడంలో జగన్ మనస్థత్వం ఎంత వికృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును ఎవరో కొట్టారని ప్రచారం చేసి మానసిక తృప్తి పొందడం.. చేసిన తప్పుడు పనులకు ఆధారాలు బయటపడకుండా అబద్దాలు చెప్పడంతో పాటు ఎలాంటి అబద్దాలైనా చెప్పి.. పక్క వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేయాలన్న మానసిక విపరీత ప్రవర్తనే కనిపిస్తోంది తప్ప.. కనీస హుందా తనం… ఓ మాజ ముఖ్యమంత్రి స్థాయి మానసిక పరిక్వత లేనే లేదని ఎవరికైనా అర్థమైపోతుంది.
చింపిరి గడ్డంతో సరిగ్గా నిద్ర కూడా లేనట్లుగా జగన్ పరిస్థితి ఉంటోందని ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ కు వచ్చిన వైనమే తెలుస్తోంది. అధికారం పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, బయటకు వస్తున్న వ్యవహారాలు, అడ్డగోలుగా చేసిన దోపిడీ మొత్తం కథలు కథలుగా వెలుగులోకి వస్తున్న వైనం.. అంతటితో పాటు ఇంత కాలం వచ్చిన ఆదాయం అంతా ఆగిపోయిందన్న ఆందోళనతో ఆయన మానసికంగా ఉన్మాద ప్రవర్తన స్థాయికి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలు రాజకీయ హత్యలే జరగకుండా జరిగాయని ప్రచారం చేయడం.. ఆస్తులు ధ్వంసం, అత్యాచారాలంటూ పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతూండటం.. మీడియా ప్రతినిధుల్ని కూడా విస్మయానికి గురి చేసింది.
జగన్ ఇంట్లో ప్రభుత్వఖర్చుతో పెట్టిన అధికారిక సమావేశ మందిలో ప్రెస్ మీట్ పెట్టి.. ఇలా మానసిక వికృతాన్ని బయట పెట్టుకున్న తర్వాత మీడియా అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. హతుల జాబితా, షర్మిల విమర్శలు, శ్వేతపత్రాలు, ఇండియా కూటమితో కలవడం సహా దేనీ గురించి ఆయన సమాధానం ఇవ్వలేదు. మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేయవద్దని.. వినుకొండలో జరిగిన హత్య ఉదంతాన్ని వివరిస్తున్నారు. కత్తి పట్టుకుని నరుకుతున్న విషయాన్ని రెండు నిమిషాల సేపు చాలా ఉత్సాహంగా వర్ణించేయం చూసినా వారికి ఆయన మానసిక స్థితి మీద ఖచ్చితంగా భయం కలుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఓ రకమైన మైండ్ సెట్ తో ఉన్నారు. తాను చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ప్రజలు తాననే దేవుడ్ని గా చూస్తారనుకున్నారు . కానీ జరగింది వేరు. ఇప్పుడు ఆయన నిజాలు తెలుసుకోలేక.. మానసికంగా మరింత కుంగిపోయి.. ఉన్మాదంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన విషయంలో కుటుంబసభ్యులు అయినా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు మానసిక నిపుణుల నుంచి వస్తున్నాయంటే.. అందులో తప్పేం ఉండకపోవచ్చు.