తిరుమల టూర్ ను జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారు ?. ఆయన కొండపైకి వెళ్లకండా ఎవరైన అడ్డుకుంటే.. అంత కంటే జగన్కు కావాల్సిందేమీ ఉండదు. అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ అడ్డుకునేది లేదని తామ శాంతియుత నిరసన చేస్తామని కూటమి పార్టీలతో పాటు హిందూ సంస్థలు ప్రకటించాయి. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వందల మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేసింది. కాన్వాయ్ కూడా రెడీ చేసింది. కానీ జగన్ మాత్రం.. తన పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని టూర్ ను రద్దు చేసుకున్నారట.
తిరుమలకు వెళ్లకుండా ఇంట్లో ప్రెస్మీట్ పెట్టిన ఆయన.. పోలీసులు మోహరించారని.. తన పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని.. దర్శనానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే వెళ్లలేదని ఆయన చెప్పినట్లయింది. ఇంత కంటే పిరికి రాజకీయ నాయకుడు ఉండరమో. గతంలో చంద్రబాబునాయుడ్ని ఎన్నోసార్లు అడ్డుకుంటామని ప్రకటించారు. కాన ఆయన ఒక్కడైనా వెళ్లారు. పోలీసులు అడ్డుకుంటే.. దాన్ని హైలెట్ చేశారు. కానీ ఇక్కడ పోలీసులు అతి జాగ్రత్తగా తీసుకెళ్లేందుకు రెడీ అయినా ఆగిపోయారు.
అసలే లడ్డూ కల్తీ అంశంతో కిందా మీదా పడుతూంటే.. తిరుమల దర్శనం పేరుతో డిక్లరేషన్ అంశాన్ని ఆయన సలహాదారులు మెడకు తగిలించారు. దీన్నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చివరికి టూర్ రద్దు చేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ నిండా.. ఆవు కథను మళ్లీ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి అవస్తలు చూసి సొంత పార్టీ నేతలు కూడా నవ్వుకోవాల్సి వచ్చింది. ఇంత ధైర్యం లేని నాయకుడు పార్టీని ఎలా నడుపుతారని వారు పెదవి విరుస్తున్నారు.