బెంగళూరులోనే ఎక్కవగా గడుపుతున్న వైసీపీ అధినేత జగన్ కు హఠాత్తుగా పార్టీ గుర్తుకొచ్చింది. చాలా రోజుల తర్వాత వైసీపీ నేతలతో సమావేశం అయ్యారు. కర్నూల్ జిల్లాకు చెందిన లీడర్లతో భేటీ అయి.. విలువలు , విశ్వసనీయతే వైసీపీ సిద్ధాంతం అంటూ రెండు బలమైన డైలాగ్ లు దంచేశారు. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయని , నాలో వీటిని చూసే నాతోపాటు నడిచారని జగన్ పేర్కొన్నారు.
రాజకీయాల్లో విలువలు , విశ్వసనీయతకు జగన్ కట్టుబడి ఉంటే రెండోసారి ప్రజలు అధికారం కట్టబెట్టేవారు.. కానీ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే లేని ఓ విధ్వంసక, దుర్మార్గ పాలనను కొనసాగించారనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటుకుపోయేలా చేసుకున్నారు. అందుకే వై నాట్ 175అని బీరాలు పలికి 11 సీట్లకు పరిమితమై చావుదెబ్బ తినాల్సి వచ్చింది. జగన్ తరుచు ప్రస్తావించే ఈ విలువలు, విశ్వసనీయతే వైసీపీ ఆయుధంగా ముందుకుసాగి ఉంటే ఆపార్టీకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదన్నది ఓపెన్ సీక్రెట్.
రాజకీయాలను ఎలా చేయకూడదో అలాగే చేసి వైసీపీ పతనావస్థకు చేరుకుంది. ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిన ట్రీట్మెంట్ తో పూర్తిగా పునాదులు కదిలిపోయాయి. జగన్ తో సన్నిహితంగా మెదిలే నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్ కు ఏమాత్రం విశ్వసనీయత లేదంటూ ఏకంగా సొంత చెల్లి చెప్పుకొచ్చింది. విలువల గురించి మాట్లాడుతోన్న జగన్.. తల్లిపై ఆస్తి కోసం కోర్టులో కొట్లాడటం ఏ విలువల రాజకీయమో ఆయనకె తేలియాలంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. జగన్ చెప్తున్న దానికి టీడీపీ ఇచ్చే కౌంటర్లు సరిగ్గా ఉండటంతో జనం కూడా జగన్ విలువలు ఉన్న నాయకుడు కాదు….టీడీపీ విమర్శిస్తున్నట్టుగా విశ్వాసఘాతకుడు అనే అభిప్రాయానికి వస్తున్నారు.