వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో మనకు బలం లేదని.. మాట్లాడేందుకు పెద్దగా సమయం రాదని..అందులో మండలిలోనే గట్టిగా పోరాడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం 58 మంది సభ్యులు, టీడీపీతో పాటు స్వతంత్రులు పధ్నాలుగు మంది ఉన్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
పదిహేడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున.. ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలవద్దని సూచించారు. పథకాలకు సంబంధిచిన డబ్బులను ఇంకా విడుదల చేయలేదని.. మండలిలో ప్రధానంగా వీటిపైనే పోరాడాలన్నారు. అసెంబ్లీలో పాస్ అయి వచ్చే బిల్లులను కూడా ఆమోదించవద్దని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలోనూ జగన్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మనకు నలభై శాతం ఓట్లున్నాయని.. తాను రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీల్లో సగం మంది జగన్ తో సమావేశానికి రాలేదు. వివిధ కారణాలతో వాడు డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది.