ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సభ్యలను సీఎం జగన్ ఖరారు చేసుకున్నారు. వారి పేర్లను మీడియాకు లీక్ చేశారు. కొత్త మంత్రులకు సీఎం జగన్ నేరుగా ఫోన్ చేసి చెప్పనున్నారు. మంత్రుల జాబితాలను శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిస్తే …ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం జిల్లా నుంచి బొత్స , రాజన్నదొర, విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్, బూడి మత్యాలనాయుడు, తూ.గో నుంచి దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ప.గో నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, గుంటూరు నుంచి అంబటి రాంబాబు, మేరగ నాగార్జున, విడదల రజనీకి అవకాశం కల్పిస్తున్నారు.
నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కడప నుంచి అంజాద్ భాషా, కర్నూలు నుంచి బుగ్గన, గుమ్మనూరు జయరాం, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజా అనంతపురం నుంచి ఉషాశ్రీచరణ్ కి చాన్స్ ఇచ్చారు. వీరిలో బొత్స, విశ్వరూప్, వేణు, వనిత, అంజాద్ భాషా, బుగ్గన, జయరాం, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి,ఆదిమూలపు సురేష్. సిట్టింగ్ మంత్రులు, మిగిలిన పదిహేను మంత్రి కొత్త మంత్రులు. రోజాకు కూడా అవకాశం ఇస్తున్నారు.
కేబినెట్లో సీఎంతో కలిపి ఐదుగురు రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఉంటారు. కృష్ణా జిల్లా నుంచి ఒక్క జోగి రమేష్‌కు మాత్రమే చాన్స్ ఇవ్వడంతో కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి లేకుండా పోయినట్లయింది. ఇప్పటి వరకూ కొడాలి నాని ఆ పదవిలో ఉన్నారు. ఆయన ఎంతెంత ఎగిరిపడినా కొనసాగింపు లభించలేదు.