జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని అనుకోవడం లేదు. వస్తే చంద్రబాబును అవమానించినట్లుగా తనను రికార్డుల్లో లేకుండా అవమానిస్తారని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన డుమ్మా కొట్టడానికి కారణాలు వెదుక్కుంటున్నారు. అందులో ఒకటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం. కాంగ్రెస్ పార్టీకి్ 54 మంది ఎంపీలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేది. 2019లో 52మంది గెలిచారు. కేవలం రెండు సీట్లు తగ్గినా.. కేంద్రంలోని బీజేపీ .. కాంగ్రెస్ పక్ష నేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇప్పుడు అత్యంత ఘోరంగా ఓడిన జగన్ రెడ్డికి ఆ హోదా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడే అవకాశాలు లేవు. నిజానికి ప్రతిపక్ష నేత అనేది ప్రోటోకాల్ మాత్రమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సింది ఆయన మాత్రమే. ఆ విషయం తెలుసు. హోదాతో సంబంధం లేకపోయినా ప్రతిపక్ష నేతగా ఆయనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ఆయన సాకులు చెబుతున్నారు.
తాను ఐదేళ్ల కాలంలో చేసిన నిర్వాకాలు తనకు రివర్స్ అవుతాయన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదనుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం దానికి కారణంగా చెప్పాలనుకుంటున్నారు. గతంలో కెోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేదని కారణం చెప్పి డుమ్మా కొట్టారు. ఇప్పుడూ అదే చేయబోతున్నారు.