వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇవాల్టి బంద్ ఫెయిల్ అయిందన్న ఆక్రోశమో, లేదంటే అవిశ్వాస తీర్మానం దరిమిలా తన గ్రాఫ్ పడిపోయిందని బాధో తెలియదు కానీ, తన కోపాన్నంతా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం ద్వారా బయటపెట్టుకున్నాడు జగన్. అయితే ఈ అసహనం సంగతి అలా ఉంచితే పవన్ కళ్యాణ్ కి నలుగురు భార్యలు అంటూ వ్యాఖ్యానించిన విషయం ఇప్పుడు జగన్ మీద పలువురు కౌంటర్లు వేయడానికి కారణం అవుతోంది. రెండవ పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి ఆనా ని పెళ్లి చేసుకున్న పవన్
ఇప్పటి కి మూడు సార్లు వివాహం చేసుకున్నారు. అయితే జగన్ మాత్రం పవన్‌కళ్యాణ్‌కి నలుగురు భార్యలు అంటూ సంఖ్యను పెంచి చెప్పారు. ఇలా సంఖ్యలు పెంచి చెప్పడానికి ఆయన అలవాటులో పొరపాటు కారణమని కొంతమంది సరదాగా కౌంటర్ లు ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మీద లక్షకోట్ల అవినీతి ఆరోపణలను ప్రస్తావించగా దానికి సమాధానం ఇస్తూ ఒకవేళ అంత డబ్బే గనక తన వద్ద ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగిలింది ఆరోపణలు చేస్తున్న వాళ్లే తీసుకోవాలని జగన్ వ్యాఖ్యానించాడు. అయితే జగన్ కి ఈ 10% అనే అలవాటు అప్పట్లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచి అలవాటని కొంతమంది విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తల నుంచి కాంట్రాక్టర్ల దాకా ఎవరికి ప్రభుత్వ సహాయం అవసరం ఉన్నా అందులో టెన్ పర్సెంట్ కమీషన్ జగన్‌కి ఇవ్వాల్సిందేనని అప్పట్లో కొన్ని పత్రికలు కథనాలు రాసేవి. అయితే జగన్ కి 10 శాతం కమీషన్ ఇవ్వడం కోసం ప్రాజెక్టుల అంచనాలు కాస్త పెంచే వారిని విమర్శలు అప్పట్లో వచ్చేవి. కాబట్టి ఇలా సంఖ్యలు పెంచే అలవాటు జగన్ కి అప్పట్నుంచే ఉందని కొందరు విమర్శలు చేశారు. అయితే ఇది ఆఫ్ ది రికార్డ్ అంశం.
కానీ జగన్ కి నంబర్లు పెంచే అలవాటు గట్టిగానే ఉందని నిరూపించే మరొక ఆన్ ది రికార్డ్ అంశం కూడా ఉంది. 2018 మార్చి నెలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినాన జగన్ ట్వీట్ చేశారు. పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు అయిందని అండగా నిలబడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు అని ఆ ట్వీట్ సారాంశం. ( https://www.telugu360.com/ys-jagan-needs-better-persons-handle-twitter/)
2011 మార్చి 12వ తేదీన పార్టీ పెట్టి ఈ ఏడాది ఆవిర్భావ సభకు ఏడు సంవత్సరాలు అయితే జగన్ మాత్రం పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు అంటూ అక్కడ కూడా ఒక సంవత్సరం పెంచేశారు.
బహుశా ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ సంఖ్యలు పెంచడం ముడుపుల కోసం ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచిన రోజులనుంచి జగన్ కి బాగా అలవాటు కావడం వల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యల సంఖ్య కూడా మూడు నుంచి నాలుగు కు పెంచి ఉంటాడని పరిశీలకులు నెటిజన్లు సరదాగా కౌంటర్ లు ఇస్తున్నారు.
ఏదిఏమైనా జగన్ కి జగనే శత్రువు అని మరొకసారి వీడియో సాక్షాలతో నిరూపించుకున్నాడు జగన్.