బెంగళూరు బనశంకరి పోలీస్ స్టేషన్లో జగన్ పీట నాగేశ్వర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. క్రికెటర్ రికీ భుయ్కి స్పాన్సర్ షిప్ కావాలని సంగీత మొబైల్స్ కంపెనీ ఓనర్ కు నాగేశ్వర్ రెడ్డి ఫోన్ చేశారు. రెండు విడతలుగా పదిన్నర లక్షల రూపాయలు తన బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఇది 2022లో జరిగింది. అయితే ఇటీవల ఆయన స్పాన్సర్ షిప్ వచ్చినందున తన కంపెనీ ప్రమోషన్ కు రికీ భుయ్ రావాలని కోరేందుకు నాగేశ్వర్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఆయన తాను డబ్బులు తీసుకోలేదని రికీ భుయ్ స్పాన్సర్ షిప్ కోసం తాను ఎవర్నీ సంప్రదించలేదన్నారు. దాంతో సంగీతా మొబైల్స్ యజమానికి బనశంకరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జగన్కు నాగేశ్వర్ రెడ్డి పేరుతో పీఏలు ఎవరూ లేరని చెప్పారని ఆయన ఫిర్యాదు చేశారు. నిజానికి జగన్ వెంట ఎప్పుడూ ఉండే వ్యక్తి కేఎన్ నాగేశ్వర్ రెడ్డి. ఆయన పేరుతో ఎవరైనా మోసం చేశారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్నది పోలీసులు తేల్చే అవకాశం ఉంది. రికీ భుయ్ మధ్యప్రదేశ్ కు చెందిన క్రికెటర్. కానీ ఆయన ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడుతున్నారు. ఆయనను ఆంధ్రకు తీసుకు రావడానికి… స్పాన్సర్ షిప్ ఇప్పించడానికి బలమైన శక్తి ఏదో ఉందని అనుకోవచ్చు.
ఏపీలో కేసు నమోదు అయితే సంచలనం అయ్యేది. కానీ బెంగళూరులో కేసు నమోదు అయింది. నాగేశ్వర్ రెడ్డి పేరుతో జగన్ వద్ద పీఏలు ఎవరూ లేరని.. ఆ పేరుతో మోసం చేశారని ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు రూ. పది లక్షలే కదా అని లైట్ తీసుకోకుండా సీరియస్ గా విచారణ జరిపితే ఇందులో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.