వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ప్యాలెస్ ఫాంటసీ ఉంది. అయనకు అత్యంత ఖరీదైన భవనాలు కట్టుకుని అందులో ఉండాలని ఆశ. ఎలాగోలా దోపిడీ చేశో.. బినామీ కంపెనీలు పెట్టో… ప్రజా ధనం ఉపయోగించో కట్టుకుంటున్నారు కానీ.. అందులో మాత్రం ఉండలేకపోయారు. ఒక్క చోట కాదు.. అనేక సార్లు ఇలా జరిగింది.
యలహంక ప్యాలెస్ – ఒక్క రోజు ఉండలేదు !
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డిని బెంగళూరుకే పరిమితం కావాలని ఆదేశించారు. ఇక్కడ క్విడ్ ప్రో కోలు చేసినా ఆయన బెంగళూరు కేంద్రంగా ఉండాల్సి వచ్చేది. దాంతో తన స్థాయికి తగ్గట్లుగా యలహంక దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ అందులో పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయారు. వైఎస్ పావురాల గుట్ట వద్ద ప్రమాదానికి గురి కావడంతో ఆయన అందులో ఉండకుండానే రాజకీయం ప్రారంభించాల్సి వచ్చింది.
లోటస్ పాండ్ ప్యాలెస్లోనూ ఉన్నది తక్కువే !
మొదట జగన్ హైదరాబాద్ సాగర్ సొసైటీలో అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. అక్కడ రాజకీయం ప్రారంభించిన తర్వాత లోటస్ పాండ్లో బినామీ కంపెనీల పేర్లతో నివాసం కట్టించుకున్నారు. అత్యంత విలాసంగా నిర్మించిన ఆ ఇంట్లోనూ ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతో దీక్షలు, పాదయాత్రలతో ఎక్కువ కాలం గడిచిపోయింది.
తాడేపల్లిలో మొండిగోడలు – జనం సొమ్ముతో సోకులు
రాష్ట్ర విభజన కావడంతో అమరావతి రాజధానిగా నిర్ణయించారు. దాంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆదిశేషగిరిరావు వెంచర్ లో బినామీ కంపెనీల పేరుతో రెండెకరాలు కొనుగోలు చేసి …మెల్లగా మొండిగోడలతో ఇళ్లు నిర్మించారు. గెలిచిన తర్వాత మొత్తం ప్రజాధనంతో సోకులు చేయించుకున్నారు. కానీ ఆ ఇల్లు జగన్ ఆలోచనకు కాస్త భిన్నం. ప్యాలెస్ రేంజ్ లేదు . అందుకే విశాఖపై దృష్టి పెట్టి… రుషికొండపై గురి పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ లోనే కాస్త నికరంగా ఆయన నివాసం న్నారు.
రుషికొండ ప్యాలెస్ – పదవి పోవడానికి కారణం
రుషికొండలో జగన్ తన పేద మనస్థత్వానికి అనుగుణంగా ప్యాలెస్ నిర్మించుకున్నారు. అందులో ఉండాలనుకున్నారు కానీ ప్రజలు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన ప్యాలెస్ జీవనం కలలు నిర్వీర్యమయ్యాయి.
చెన్నైలోనూ ప్యాలెస్ నిర్మాణం
బయటకు రాలేదు కానీ జగన్ చెన్నైలోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఉండేందుకు ఇష్టపడటం లేదని.. ఏపీలో ఉండేందుకు ఆయన అసలు సిద్ధంగా లేరని అందుకే చెన్నైలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు.
ఇవే కాదు… ఇంకా !
జగన్ ప్యాలెస్ల పిచ్చి… ఇడుపుల పాయ నుంచి ప్రారంభమవుతుంది. ఇడుపుల పాయ, పులివెందుల, కడపల్లో కూడా భారీ ప్యాలెస్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏవీ తన సొంతమిచెప్పుకలేరు. ఎందుకంటే అన్నీ తప్పుడు సంపాదనతో… సూట్ కేస్ కంపెనీల పేరు మీదనే ఉంటాయి.