తాను ముఖ్యమంత్రినని… కోర్టుకు హాజరు కావడం.. వల్ల ప్రజాధనం ఖర్చు అవుతుందని.. అందువల్ల… కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని.. తాను ప్రతీవారం కోర్టుకు రావడం వల్ల ప్రజాధనం భారీ ఎత్తున ఖర్చవుతుందని జగన్ … మినహాయింపు కోసం కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. తరచుగా కోర్టుకు హాజరైతే.. పరిపాలన దెబ్బతింటుందన్నారు. సీఎం హోదాలో ఉన్నందున కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్తోపాటు భద్రతకు భారీగా వ్యయం అవుతుందని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు.
అక్రమాస్తుల కేసులో … ప్రతీ శుక్రవారం ..సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయనపై ఉన్న కేసులు అత్యంత తీవ్రమైనవి కావడంతో.. బెయిల్ ఇచ్చే సమయంలో అనేక కఠిన నిబంధలు పెట్టారు. విచారణ విషయంలోనూ.. కోర్టులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించాయి. పాదయాత్ర చేసే సమయంలో ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం కనిపించలేదు. అప్పట్నుంచి ఎప్పుడైనా వ్యక్తిగత కారణాలతో.. కోర్టుకు డుమ్మా కొడుతున్నారు కానీ.. ఎక్కువసార్లు కోర్టుకెళ్లి వస్తున్నారు. సీఎం అయిన తర్వాత మాత్రం ఒక్క సారి కూడా.. సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు.
క్విడ్ ప్రో కో కేసుల్లో.. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వాటిపై .. చార్జిషీట్లు దాఖలు చేసి.. విచారణ ప్రక్రియ ప్రారంభదశలో ఉంది. గత ఐదేళ్ల కాలంలో .. నాంపల్లిలోని సీబీఐ కోర్టు ప్రతీ శుక్రవారం.. విచారణ జరుపుతోంది. అయితే.. విచారణ ప్రక్రియ మాత్రం.. ఏదో కారణంగా.. ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో.. జగన్ సీఎం అయ్యారు. సీఎం హోదా రావడంతో.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారు.