శవం లేకపోతే వైసీపీ రాజకీయాలు నడవవని విపక్షాలు జనం చేసే ఆరోపణల్ని తరచూ నిజం చేసేందుకు వైసీపీ నేతలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వినుకొండలో ఇద్దరు యువకుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలతో జరిగిన హత్య వీడియోలు భయంకరంగా ఉండటంతో.. ఇంతకన్నా మంచి చాన్స్ మించిన దొరకదని జగన్ రంగంలోకి దిగిపోవాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో రెస్టు తీసుకుంటున్న ఆయన హుటాహుటిన బయలుదేరి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చేశారు. శుక్రవారం వినుకొండ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
శవం దొరకింది కాబట్టి ఆయన బయటకు వచ్చారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. చనిపోయిన వ్యక్తి.. చంపిన వ్యక్తి ఇద్దరూ వైసీపీ నేతలు. వారి హత్యలో ఉన్నవి వ్యక్తిగత గొడవలే తప్ప.. రాజకీయం కాదని స్వయంగా ఎస్పీ ప్రకటించారు. అయినా తమ కార్యకర్తను చంపారని.. అది రాజకీయం చేసుకోవడానికి చాలని జగన్ బయలుదేరారు. నిజంగా ప్రజా సమస్యలపై ఆయన బయలు దేరి ఉంటే ఏమైనా మైలేజీ వచ్చేదేమో కానీ.. ఓ శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేందుకు వెళ్లడమే ఆయన రాజకీయం స్టైల్ ఎలా ఉంటుందో చెప్పానికి నిదర్శనమంటున్నారు.
జగనే భయంతో బెంగళూరు వెళ్లిపోయారని.. పార్టీ క్యాడర్ కు ఇక భరోసా ఎవరు ఇస్తారని విమర్శలు ప్రారంభం కావడంతో.. జగన్ ఏపీకి రావడమే మంచిదని అనుకున్నారు. బెంగళూరులో ఏ రాజకీయ చర్చలు జరిపారో కానీ.. ఆయన రాక మాత్రం .. శవ రాజకీయాల కోసమే రావడంతో.. వైసీపీ బ్రాండ్ పాలిటిక్స్ ను మానుకోరని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ముసలోళ్ల శవాల కోసం.. జోగి రమేష్ చేసిన రాజకీయంతో తిట్లు తిన్నా.. వైసీపీ నేతలు తుడిచేసుకుని రెడీ అయిపోతున్నారు.