యలహంక ప్యాలెస్ లో రాజకీయ విందులు జోరుగా సాగుతున్నాయి. జగన్ రెడ్డి విజయవాడ వరదల పరిస్థితి ఘోరంగా ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ ఆయన జోరుగా విందు భేటీలు నిర్వహిస్తున్నారు. ఆ విందు భేటీలకు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని మాత్రమే ఆహ్వానిస్తున్నారు.
శనివారం యలహంక ప్యాలెస్ కు కాంగ్రెస్ వీఐపీలు వచ్చారు. వారెవరన్నదానిపై స్పష్టత లేదు కానీ… శివకుమార్ ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ దక్షిణాది వ్యవహారాలను ఆయన చూస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం దగ్గర నుంచి ప్రతీది ఆయన కనుసన్నల్లో జరుగుతోంది. వైఎస్ కుటుంబానికి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ తో డీల్ సెట్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత.. జగన్ ఆ పార్టీపై వేసిన నిందలు అన్నీ ఇన్నీ కావు . బీజేపీతో అంట కాగుతూ రాహుల్ పైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. పార్లమెంట్ లో నెహ్రూనూ నిందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు కాంగ్రెస్ నుంచే వచ్చారా అన్న డౌట్ చాలా మందికి వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చపోయేలా చేసుకుని.. బీజేపీ తనను ఓన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. రేపు ఎప్పుడైనా తన ను అరెస్టు చేస్తే.. సానుభూతి వచ్చేలా…ఇండియా కూటమి మద్దతుగా ఉండేలా ఆయన మాట్లాడుకుంటున్నారు.
జగన్ రెడ్డి పొలిటికల్ పార్టీలు ఎంత విజయవంతమవుతాయో తెలియదు కానీ… జగన్ రెడ్డి నీడ మాతర్ం.. కాంగ్రెస్ పై పడకూడదని ఆయన సోదరి షర్మిల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ రెడ్డిది ఉనికి సమస్య. అందుకే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.