రాజకీయం చేసేది నీ కోసం.. నా కోసం కాదు.. రాష్ట్రం కోసం అని చిన్న ఆలోచన మనసులో పెట్టుకోకపోతే జరిగే పరిణామాలు ఆ రాష్ట్రానికి ఎలా పెనుశాపంగా ఉంటాయో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. అత్యంత ఘోరంగా ప్రజలు ఓడించినా సరే ఆ క్షుద్ర రాజకీయానికి పిల్ల చేష్టలు జోడించి ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని మళ్లీ కోలుకోకుండా చేయాలని తపన పడుతున్నారో కళ్ల ముందే ఉంది. పెట్టుబడిదారులు ఎవరూ ఏపీ వైపు రాకుండా చూసేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తే.. పాపం ఏపీ అని అనుకోని వారు ఉండరు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వందల కోట్లు పెట్టి విధ్వంసం సృష్టించాలనుకోవడం…. అసలేమీ జరగకపోయినా అంత కంటే భారీగా ఖర్చు పెట్టి ఢిల్లీలో తప్పుడు ప్రచారాలు చేయడం… ఆధారాలు అడిగిన వారిని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని పిచ్చి మాటలు మాట్లాడటం… చూస్తూంటే ఏపీ ప్రతిపక్ష నేతలో.. అందరూ చెప్పే పదానికి అసలైన అర్థంలా ప్రవర్తిస్తూనే ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు ఆయన అందరితో అలాంటి పనులు చేయించి ముసిముసిగా నవ్వుకుంటూ తెర వెనుకే ఉండేవారేమో కానీ ఇప్పుడు పదవి పోయాక నేరుగా బయటకు వచ్చి తాను అందరూ పెట్టిన పేరుకు జస్టిఫికేషన్ ఇస్తున్నారు.
Also Read : బ్యాక్ టు బెంగళూరు
ఇంత ఘోరంగా ఓడిపోయాక పోగొట్టుకున్నదేమీ లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది. ప్రేమోన్మాదులు తనకు దక్కకపోయినా వేరే వారికి దక్కకూడదన్నట్లుగా ప్రవర్తిస్తారు. అదే తరహాలో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా ప్రతిపక్ష నేత తీరు ఉండటం.. ఆయన చెప్పే మాటలు.. సోషల్ మీడియా సైకోల తీరు చూసి ఎవరైనా ఆందోళన చెందడం ఖాయం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారికి తన మన ఉండవు. కొంత కాలంగా అదే చూపిస్తున్నారు. ఇక రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు.
ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం ఏమిటో కానీ.. ఈ తరహా రాజకీయాలు వదలడం లేదు. చంద్రబాబు చెప్పినట్లుగా భూతాన్ని భూస్థాపితం చేస్తే తప్ప.. మంచిరోజులు రావని… గత వారం రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ ఓ క్లారిటీ వస్తోంది. అదెప్పుడు జరుగుతుందో ?