జగన్ రెడ్డి మానసిక స్థితి రోజు రోజుకు ఎవరి ఊహకు అందని స్థాయికి వెళ్లిపోతోందని శుక్రవారం ఆయన పెట్టిన మరో ప్రెస్మీట్ తర్వాత ఎవరికైనా స్పష్టత వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని తేల్చేశారు. ఇక సిట్ కూడా అవసరం లేదనేశారు. సుప్రీంకోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఉన్న ఆయన ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
తానే తీర్పు చెబుతున్నట్లుగా జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఓ రెండు ఈవో ప్రెస్మీట్ క్లిప్పులు, చంద్రబాబు తప్పు చేశాడని సుప్రీంకోర్టు తేల్చిందని ఇంగ్లిష్ మీడియాలో వచ్చిందని పేపర్ క్లిప్పులు, లడ్డూ కల్తీపై తొలి రోజు జరిగిన విచారణలో జడ్జి చేసిన వ్యాఖ్యల్లో ఓ భాగాన్ని చూపించి ఇక.. విచారణ పూర్తయిందని లడ్డూలో కల్తీ లేదని తేలిందనేశారు ఇక చంద్రబాబుకు శిక్ష వేయడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడారు.
కనీసం సుప్రీంకోర్టు సిట్ ను కూడా జగన్ స్వాగతించకపోవడంతో మొత్తం తిరుమలలో దేవదేవుడికి జగన్ చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయన్న టెన్షన్ జగన్ లో కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఎఆర్ డెయిరీ అడ్డంగా దొరికిపోయింది. టెండర్లలో కూడా అడల్టరేషన్ చేసిన వైనం వెలుగు చూసింది. ఎక్కడి నుంచి ఆ నెయ్యి తెచ్చారో ఎన్ని ట్యాంకర్లు లడ్డూ తయారీకి వాడారో సిట్ తేలుస్తుంది. ఇవన్నీ బయట పడితే..తన పరిస్థితి ఘోరంగా ఉంటుందని జగన్ టెన్షన్ పడుతున్నారు. ఇక సిట్ విచారణ అవసరం లేదంటున్నారు.
చంద్రబాబును దేవుడే శిక్షిస్తాడని జగన్ చెప్పుకొచ్చారు. అసలు విచారణకు అడ్డుపడుతున్న జగన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారో ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.