జగన్మోహన్ రెడ్డి ఫోర్ డే వర్కింగ్ పాలసీ పెట్టుకున్నట్లుగా ఉన్నారు. తాడేపల్లిలో నాలుగు రోజులు ఉంటే బెంగళూరులో మూడు రోజులు ఉండాలనుకుంటున్నారు. అయితే గత వారం బెంగళూరు వెళ్లలేదు. ఈ వారం వెళ్లే అవకాశం ఉంటుందో లేదోనని పులివెందుల టూర్ పెట్టుకున్నారు. బుధవారం ఆయన పులివెందుల వెళ్తున్నారు. మమూలుగా వెళ్తే ఏం బాగుంటుందని.. రెండు పరామర్శలు పెట్టుకున్నారు. గుంటూరులో, బద్వేలులో జరిగిన ఘటనల కుటుంబాలను పరామర్శించి పులివెందుల వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూరు వరదలతో ఇబ్బంది పడుతోంది. వారం రోజుల నుంచి అదే పరిస్థితి. యలహంకలో జగన్ నివాసం ఉండే ఏరియాలోనూ పెద్ద ఎత్తున వరదలు వచ్చాయని మీడియా చూపిస్తోంది. అక్కడ ప్రజల్ని తరలిస్తున్నారు. కొంత మంది రోడ్లపై నాలుగు అడుగుల మేర నిలిచిన నీటిలో చేపలు పడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్యాలెస్ కు వెళ్లడం కన్నా పులివెందుల వెళ్లడం బెటర్ అని జగన్ అనుకున్నారు. అనుకున్న విధంగా పులివెందుల వెళ్తున్నారు.
అక్కడ రెండు, మూడు రోజులు ఉన్న తర్వాత వరద తగ్గితే బెంగళూరు వెళ్లే అవకాశం ఉంది. జగన్ ఎవరినైనా పరామర్శించాలనుకున్నప్పుడు ఆ ఘటనను రాష్ట్ర సమస్యగా మార్చేందుకు కొంత మందితో ఆ ఘటనపై అదే పనిగా ప్రకటనలు ఇప్పిస్తారు. ఆ తర్వాత బయలుదేరి వెళ్లి మళ్లీ ఆవే ఆరోపణలు చేస్తారు . ఇప్పుడూ అదే చేయబోతున్నారు.