జగన్ రెడ్డి చాలా త్వరగా టీడీపీ నేతలు ఎదురు చూసిన ఎఫెక్ట్‌కు వచ్చేశారు. ఆయన గురువారం ప్రెస్మీట్లో పెట్టిన ఆర్తనాదాలు టీడీపీ నేతలు, ఆయన హయాంలో బాధలు పడిన వారికి ఎంతో సంతృప్తిని ఇచ్చి ఉంటాయి.
తాను అధికారంలోకి రాగానే పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటారట..రిటైరైపోయిన సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకు వస్తారట.. ఎవర్నీ వదిలి పెట్టరట.. చట్టం ముందు నిలబెడతారట. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు కూడా లేకుండా సోషల్ మీడియా ఆక్టివిస్టులను తీసుకెళ్తున్నారట పోలీసులు. వీరంతా వైసీపీ కార్యకర్తలు అని చెప్పే ధైర్యం కూడా లేని జగన్ పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామన కూడా చెప్పుకొొచ్చారు. జమిలీ ఎన్నికలు వస్తాయని మళ్లీ మా పార్టీనే వస్తుందని ఆయన బెదిరించారు.
ప్రెస్మీట్లో జగన్ రెడ్డి ఆర్తనాదాలు వింటే ఐదేళ్ల కాలంలో ఆయన చేసిందేమిటో అందరికీ గుర్తుకు వస్తుంది. డీజీపీ పేరును.. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును చెప్పి మరీ జగన్ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే.. తిరుమలరావుకు తన హయాంలో మంచి పోస్టింగ్ ఇచ్చారంట.. ఇప్పుడు ఆయన ఇలా వ్యవహరించకూడదంట. జనగ్ రెడ్డి చేసిన నిర్వాకాలతో ఎంత మంది ఐపీఎస్‌లు జైలుకు వెళ్లబోతున్నారో కళ్ల ముందే ఉంది.
2014 నుంచి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ప్రజాస్వామ్యయుతంగా టీడీపీ ఉంటే ఫేక్ న్యాస్లతో తప్పుడు ప్రచారాన్ని చేసి కులాలను రెచ్చగొట్టి విజయం సాధించారు. తాను అధికారంలోకి రాగానే.. టీడీపీ నేత హాహాకారాలే తనకు వీనుల విందు అనుకున్నారు. పార్టీ నేతలతో బూతులు తిట్టించారు. న్యాయవ్యవస్థనూ వదల్లేదు. ఇప్పుడు ఆయన నీతులు చెబుతూ ప్రజాస్వామ్యం అని తెరపైకి వసతున్నారు. ఒక సారి వచ్చిన అవకాశాన్ని ఘోరంగా దుర్వినియోం చేసిన జగన్ రెడ్డికి మరో చాన్స్ ఎలా వస్తుందని ఆయన అనుకుంటున్నారో కానీ.. ఇలాంటి ఆర్తనాదాలు మాత్రం.. టీడీపీ క్యాడర్ ఈగోను శాటిస్ ఫై చేస్తోంది. ఇంత త్వరగా జగన్ రెడ్డి ఆర్తనాదాలు పెడతారని మాత్రం వారు ఊహించలేకపోయారు.