జగన్ రెడ్డికి, ఆయన స్ట్రాటజిస్టులకు ఒక్క ప్లాన్ మినహా మరే ఐడియా రాదేమోనని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అంటే మీరు అవినీతికి పాల్పడలేదా అంటారు. పాల్పడలేదు అంటే ఏమీ లేని దాంట్లో అదే అవినీతి అని బురద చల్లేస్తారు. ప్రతీ దానికి అంతే. అయితే ఇప్పటి వరకూ రాజకీయ ప్రత్యర్థులపైనే ఇలా చేసేవారు. ఇప్పుడు తన కుటుంబంలో జరుగుతున్న అంశాలను కవర్ చేసుకోవాడానికి అన్ని కుటుంబాలపైనా తోసేశారు.
అన్ని కుటుంబాల్లో ఆస్తి గొడవలు ఉంటాయట. జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నో కుటుంబాలు ఎలాంటి గొడవలు లేకుండా ఆస్తులు పంచుకుంటుకున్నారు. కోర్టుల వరకూ వెళ్లడం లేదు. ముఖ్యంగా తల్లి, చెల్లిపై కోర్టులకు వెళ్లేవారు తక్కువ. జగన్ రెడ్డి లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్లు మాత్రమే వెళ్తారు. అయినా ఊళ్లో కుుటంబాల గురించి జగన్ కు ఎందుకు.. తన కుటుంబంలో సమస్యల గురించి ఆయన చెప్పుకోవాలి కానీ. కానీ అందరికీ ఆ బురద అంటించేస్తే నార్మల్ అయిపోతుందని జగన్ రెడ్డి భావన.
అయితే జగన్ రెడ్డికి సోదరి షర్మిలనే వెంటనే కౌంటర్ ఇచ్చారు. కుటుంబ సమస్యలు ఉండొచ్చు కానీ అందరూ తల్లి, చెల్లిని కోర్టుకు లాగుతారా అని ప్రశ్నించారు. బెయిల్ రద్దు కు కుట్ర అంటూ కొత్త కామెడీ ప్రచారం చేస్తున్నరాని .. అసలు సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదన్నారు. భూముల్ని మాత్రమే అటాచ్ చేసిందన్నారు. మొత్తంగా జగన్ రెడ్డి తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంది కాక ఇప్పుడు కోర్టుకీడ్చారని ఆమె అంటున్నారు.
అసలు కుటుంబాన్ని రోడ్డున పడేసి డైవర్షన్ గేమ్ ఆడుతూ.. మళ్లీ ఇతరుల్ని డైవర్షన్ చేస్తుననారని అనడమే జగన్ రెడ్డి స్టైల్. అదే అయన బిత్తిరి రాజకీయం.