జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన కళ్ల ముందే ఉన్నా ఆయన కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడితే నిజాలన్నింటినీ అక్కడిక్కడ బయట పెడతారన్న ఉద్దేశంతో ఆయన రికార్డెడ్ వీడియోలు వదులుతున్నారు. బడ్దెట్ పై ఆయన గంటకుపైగా మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశారు. అంతా ఎప్పుడూ చెప్పే స్కోత్కర్షలు.. చంద్రబాబు జపమే ఉంది కానీ.. వింతగా ఓ కొత్త విషయాన్ని చెప్పారు. అదేమిటంటే… ఇప్పుడు వస్తున్న పెట్టుబడులన్నీ జగన్ రెడ్డి పుణ్యమేనట. ఆయనే చెప్పుకున్నారు. నిన్న రిలయన్స్ చేసుకున్న ఎంవోయూలకు కూడా తమ హయాంలోనే ముందడుగులు పడ్డాయట.దానికి సాక్ష్యం ఏమిటంటే.. అంబానీతో కలిసి జగన్ నవ్వుతూ నిల్చున్న ఫోటోలట. ఏ మాత్రం ఆలోచించకుండా క్లెయిమ్ చేసుకుని దానికి సాక్ష్యంగా ఆ ఫోటోలు ప్రదర్శింప చేసుకున్నారు.
తన హయాంలో అంబానీలు.. అదానీలు.. టాటాలు.. బిర్లాలు వచ్చేశారని ఆయన చెప్పుకున్నారు. 8 కీలక ప్రాజెక్ట్‌లకు కీలక అడుగులు అడుగులు పడ్డాయి. వీళ్లే అన్ని తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చేసారు. ఐదేళ్ల కాలంలో ఆయన తరిమేసిన ప్రాజెక్టులే తప్ప కొత్తగా వచ్చిన ప్రాజెక్టులే లేవు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయినా ఏ మాత్రం ఫీలవుకుండా తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయారు.
అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారని.. తాము అసలు పెద్దగా అప్పులే చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు. 018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్ప మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. కాగ్ మాత్రం అంతకు రెట్టింపు అప్పు ఉందని పత్రాలు బయట పెట్టింది. అయినా జగన్ రెడ్డి తన మీడియాలో పదే పదే అబద్దాలు ప్రచారం చేసుకుని అదే నిజమని తనను నమ్మే వారికి చెప్పడానికి ప్రయత్నాలు కానీ రియాల్టీలోకి మాత్రం రావడం లేదు.