వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో అసలు లబ్దిదారుల కన్నా.. అర్హత పేరుతో ఎలిమినేట్ చేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అర్హతలు మారుస్తామని కూడా చెప్పలేదు.
గత మేనిఫెస్టోలో చేయలేనివి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఐదేళ్ల పాటు ఇదిగో అదిగో అన్న పనులు.. పథకాలను కొత్త మేనిఫెస్టోలో పెట్టారు. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని అందరూ అనుకునే వృద్ధుల పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అతి తెలివికి పోయినట్లుగా కనిపిస్తోంది. మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని .. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు.
ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు. గత మేనిఫెస్టోలో రాజధాని అంశం పెట్టలేదు. సారి విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడం వైసీపీకే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పుకచ్చారు. గతంలో గెలిచిన ేడాదిలో పూర్తి చేస్తామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. ఇలాంటి సమయంలో జగన్ మేనిఫెస్టో తేలిపోయింది.