సీనియర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సీనియర్ల పేరుతో తనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా.. పెత్తనానికి ప్రయత్నం చేసినా.. వెంటనే కట్ చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో ఉన్న కొంత మంది.. అప్పట్లో.. ఆయన తండ్రి వైఎస్‌తో కలిసి పని చేశారు. వైఎస్ తో వాళ్లు.. డీల్ చేసిన విధానం వేరుగా ఉండేది. వైఎస్ చేసిన రాజకీయం వేరుగా ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వారందర్నీ.. గ్రిప్‌లో పెట్టుకోవడమే కాదు.. వారి మాటలు విని.. వారి డిమాండ్లను తీర్చడానికి ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీనియర్లు కేబినెట్ సమావేశాల్లో కూడా నోరెత్తే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి తేవడానికే… ఎవరూ నోరెత్తకుండా ఉండటానికే.. జగన్.. కట్టడి వ్యూహాలు అమలు చేస్తున్నారంటున్నారు.
ప్రభుత్వం అంటే జగన్ మాత్రమే కాదు.. జగన్ తో పాటు.. చాలా మంది ఉంటారు. కేబినెట్ ఉంటుంది. అందులో సీనియర్ మంత్రులు ఉంటారు. కానీ.. వారెవరికీ.. ఇప్పుడు ప్రాధాన్యం దక్కడం లేదు. సీనియర్ మంత్రులు అనేవాళ్లను.. జగన్ భిన్నమైన కోణంలో వినియోగించుకుంటున్నారు. వారితో వివాదాస్పద ప్రకటనలు చేయించి.. వారిపై.. కొన్ని వర్గాల్లో ఉద్దేశపూర్వక వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. దీనికి బొత్స సత్యనారాయణ ఓ ఉదాహరణ. ఓ సీనియర్ మంత్రిగా ఆయన రాష్ట్రంలో కొన్ని వర్గాలను కించ పరిచేలా ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా.. హైకమాండ్ ఆదేశాల మేరకేనని ఆయన బహిరంగంగానే చెప్పుకుంటున్నారు . ఇక ఇతర సీనియర్ మంత్రులు నోరు మెదిపే పరిస్థితి లేదు. ఇక సీనియర్ నేతల పరిస్థితి కూడా అంతే. ఆనం రామనారారయణరెడ్డి లాంటి వారి విషయంలో.. ఈ విషయం స్పష్టయింది.
పార్టీలో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పినా ఊరుకునేది లేదని ఆనంకు ఇచ్చిన గట్టి వార్నింగ్‌తోనే తెలిసొచ్చిందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆనం.. వైఎస్ కు అపర విదేయుడుగా ఆలోచనాపరుడుగా పేరుంది. వైఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారు. అలాంటి సీనియర్ నేతకు అలాంటి ఆనం బెట్టింగ్ లాంటి అరాచకాలపై తన అబిప్రాయం చెప్పగానే షోకాజ్ హెచ్చరికలు వెళ్లడం… అందులో భాగమే. ఇంక ఏ సీనియర్ నేత కూడా.. నోరు మెదిపే సాహసం చేయలేరు. అలా చేస్తే.. వారు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమై… రంగంలోకి దిగారని అర్థం చేసుకోవచ్చంటున్నారు.