జగన్ రెడ్డి తన వద్దకు వచ్చే పార్టీ నేతలకు దైర్యం చెప్పడానికో లేకపోతే తనకు మాత్రమే తెలిసిన లోకలంలో అలాగే ఉటుందని అనుకుంటారో కానీ అసలు రియాలిటీకి దగ్గర లేని విధంగా మాట్లాడుతూ ఉంటారు. తాజగా అనంతపురం జిల్లాకు చెందిన నేతల్ని పిలిపించుకుని ఆయన చెప్పిన కబుర్లు విని చాలా మంది అబ్బో అనుకున్నారు.
ప్రభుత్వంపై ఆరు నెలలలోన వ్యతిరేకత ప్రారంభమైందని ప్రజల తరపున రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పుకొచ్చారు. అందుకే ఫీజు రీఎంబర్స్ మెంట్ తో పాటు ఇతర సమస్యలపై రోడ్డెక్కుతున్నామన్నారు. ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది మరి సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రశ్న ఎదురు వారికి వచ్చింది. దానికి జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు చేశారనే బహిష్కరించారట. అక్రమాలు చేస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలే చూసేవారు కదా. ఎన్నికలకు బహిష్కరించడం ఎందుకు అన్నదానిపై ఆయన వద్ద సమాధానం ఉండదు. రైతులు సంతోషంగా ఉన్నారని అంటున్నారని రాజీనామాలు చేస్తే తెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు.
ఆ రాజీనామాలు ఏదో తన పదకొండు మంది ఎమ్మెల్యేలతో చేయిస్తే ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో తేలిపోతుంది కదా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయ. జిల్లాల వారీగా పార్టీ నేతల్ని పిలిపించుకుంటున్నారు కానీ ఆయన వారి మాటలని ఆలకించడం లేదు. ఆయన చెప్పేది మాత్రం వినిపించి పంపేస్తున్నారు. అనంతపురం నేతలతో కూడా అంతే. దీని మీడియాలో ప్రచారం చేసుకోవడానికి బైట్లు వస్తాయి కానీ పార్టీకి ప్రయోజనం ఏమిటన్నదానిపై మాత్రం క్యాడర్ కూడా అర్థం కావడం లేదు. పార్టీ సమావేశాలు పెడుతూంటే..సీనియర్ నేతలు ఎవరూ హాజరు కావడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే కొంత మంది వస్తున్నారు. పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అయినా జగన్ తన లోకంలో తాను ఉండి .. తాను ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసి వెళ్లిపోతున్నారు.