జుట్టు ఉంటేనే ముడి వేసుకోగలం అని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన జగన్ చివరికి ఆ జుట్టు లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ నేతలకు కొత్త హితబోధ చేస్తున్నారు అదేమిటంటే కేరెక్టర్, క్రెడిబులిటీ పడేస్తే మరలా ఏరుకోవడం కష్టం అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశం అయ్యారు. వారిని ఉద్దేశించి ఎప్పట్లాగే ఓ గంట సేపు ప్రసంగించారు. చంద్రబాబు జపం చేసిన తర్వాత.. ఆయన తన ప్లాన్లు చెప్పారు.
అదేమిటంటే.. సంక్రాంతి తర్వాత అంటే జనవరి నెలాఖరు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టూర్లు వేస్తారు. బుధ, గురువారాల్లో రెండు రోజులు పర్యటిస్తారట. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తారట. దానికి “కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం” అని పేరు పెట్టినట్లుగా కూడా జగన్ వారికి చెప్పారు. తాను జిల్లాలకు వచ్చేటప్పటికీ.. అన్ని రకాల పార్టీ పదవులు భర్తీ చేయాలని .. జిల్లా అధ్యక్షులకు చెప్పానన్నారు. ఈ సమావేశంలో నేతలకు క్రెడిబులిటీ గురించి జగన్ చాలా సేపు చెప్పారు. మల్లీ జైలుకెళ్లినా వచ్చి సీఎం అవుతానని ..పార్టీని నమ్ముకుని ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు..నష్టాలు ఉంటాయన్నారు. పదేళ్లు అన్నీ భరించి అధికారంలోకి వచ్చినా అవే మిగిలాయని ఎక్కువ మంది బాధపడుతున్నారని ఆయన గుర్తించలేకపోయారు.
జగన్ రెడ్డి ఇంకా రియాలిటీలోకి రాలేదని చెప్పడానికి ఈ స్పీచ్ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి కార్యకర్తకు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఉండాట.. వారంతా ప్రతి రోజూ ప్రభుత్వాన్ని తిడుతూ అంటే ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలట. ఆయన మాట్లాడిన విధానం చూస్తే సోషల్ మీడియా తప్ప ఇంకేం అక్కర్లేదన్నట్లుగా ఉందని ఫీలయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలు అని చెప్పారు కానీ.. దేవినేని అవినాష్, ప్రతాప్ అప్పారావు తప్ప ఎవరూ రాలేదు.
పార్టీలోనే ఉన్న వెల్లంపల్లి నుంచి పేర్ని నాని, కొడాలి నాని, వంశీ సహా… కాస్త పేరున్న నెతలెవరూ రాలేదు. విజయవాడ నుంచి కార్యకర్తల్ని పిలిపించుకుని వారే ముఖ్యనేతలు అన్నట్లుగా ప్రసంగించుకుని వెళ్లిపోయారు.