వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్‌గా మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అందులో జగన్‌కి సంబంధించిన విశేషాలు ఏమేమి ఉంటాయి? అనే ఆసక్తి నెలకొంది. జగన్ పాత్రలో ఓస్టార్ హీరో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే.. అలాంటిదేం లేదని తేలిపోయింది. ఇందులో జగన్ కనిపించేది ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే అని సమాచారం. అది కూడా వైఎస్సార్ చనిపోయిన తరవాత అతని వారసుడిగా జగన్ ఎదిగే విధానమే చూపిస్తారట. కేవలం ఒక రోజు కాల్షీట్లతో ఈ పాత్రని ముగిస్తారని తెలుస్తోంది. అందుకే పెద్ద హీరోల జోలికి వెళ్లరని, ఓ యువ నటుడితోనే ఈ పాత్ర చేయిస్తారని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రాజెక్టుపై మమ్ముట్టి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని, నటీ నటుల ఎంపికలో ఆయన ప్రమేయం కూడా ఉంటోందని, జగన్ పాత్ర ఎవరు వేయాలో కూడా మమ్ముట్టినే సూచించారని, ఆ సలహా మేరకే జగన్ పాత్రధారిని ఎంచుకోబోతున్నారని తెలుస్తోంది. జగన్‌గా కనిపించే ఆ యువ హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.