కాపు రిజర్వేషన్ల అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మార్చిన తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాలను కూడా… ఆశ్చర్యరపరిచింది. మాట తప్పను.. మడమ తిప్పనంటూ.. జగన్మోహన్ రెడ్డి నాలుక మడతేసిన వైనం… వెనుక గురి తప్పిన వ్యూహం ఉందేమోనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి.. ఎన్ని సెల్ఫ్ గోల్స్ చేసుకున్నా… చంద్రబాబుకు అంతో ఇంతో పోటీగా నిలుస్తున్న నేత. ఆయన కావాలని పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా దుర్భాషలాడటం… కాపు రిజర్వేషన్లపై కసరత్తు చేయకుండా మాట్లాడటం అనేది .. జరగని పని. కచ్చింతగా ప్లాన్డ్గా మాట్లాడి ఉంటారనేది అందరూ అంచనా వేసే విషయం. పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో.. ఎన్ని విమర్శలు వచ్చినా … క్షమాపణలు కానీ.. తప్పయిపోయిందని కానీ చెప్పలేదు. కానీ ఆ ఇష్యూ అంతటితో క్లోజ్ అపోయింది. కానీ కాపు రిజర్వేషన్ల అంశం అలా కాదు. రాజకీయాన్ని మార్చేయగల శక్తి దానికి ఉంది.
ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారుడ్ని పెట్టుకున్న తర్వాత.. జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలపై.. లెక్కలు ఎక్కువగానే వేసుకుని ఉంటారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ తర్వాత కాపు యువత… ఎక్కువగా జనసేన వైపు వెళ్లిపోయింది. ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. అంతకు అంతగా.. తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలంటే.. బీసీలను… ఆకర్షించాలి. బీసీలు సంప్రదాయబద్దంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు దారులు. వారు.. కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. అందుకే..తాను కూడా కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి… అటు కాపు నుంచి వ్యతిరేకత.. అటు బీసీల నుంచి అనుకూలత వచ్చి.. రెండు వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుందని జగన్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ నాలుగు రోజులైనా… కాపు నేతలంతా తనపై విరుచుకుపడటమే.. తనకు మద్దతుగా ఒక్క బీసీ నేత మందుకు రాకపోవడంతో.. జగన్ ప్లాన్ తలకిందులయిటనట్లయిందన్న ప్రచారం జరుగుతోంది.
తను ఆశించిన ఎమోషన్ కోసం నాలుగు రోజులు ఎదురు చూసిన జగన్… రోజు రోజుకు.. తనకు నిరసనల సెగ ఎక్కువవుతూండటంతో… ఇక యూటర్న్ తీసుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో… మూడు రోజుల నుంచి పార్టీ నేతలతో.. జగన్ మాటలు వక్రీకరించారన్న ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చెప్పి.. మళ్లీ కాపులకు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేశారు. కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తామని ప్రకటించారు. అయితే ఈ మాట జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదన్న అంశం.. చర్చనీయాంశమవుతోంది. తన చేతుల్లో లేదు.. ఇవ్వలేను… అన్న వ్యక్తి.. పిఠాపురం వచ్చే సరికి మాట మార్చడానికి కారణం తను అనుకున్నవిధంగా బీసీల్లో ఎమోషన్ రాకపోవడమేనని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.