జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి స్పీచ్లోనూ ఒకటే చదివేవారు. తాను అందరికీ అన్నీ ఇచ్చేశానని అందరూ హ్యాపీగా ఉంటున్నారని చెప్పేవారు. అసలు ప్రజలకు బాధలనేవే లేవని చెప్పేవారు. అధికారం పోయిన తర్వాత అందరూ తనలాగే బాధలు పడుతున్నారని ఆయనకు అనిపిస్తుది. అందుకే సందర్భం.. సమావేశం ఏదనా దీనంగా ఫేస్ పెట్టి ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారు. నాలుగు రోజులు బెంగళూరులో..మూడు రోజులు తాడేపల్లిలో ఉంటున్న ఆయన.. ఉన్న మూడు రోజుల్లో ఓ వీడియో రీలీజ్ చేయించాడనికి ఎవరితో ఒకరితో సమావేశం పెట్టుకుంటారు.
ఇవాళ అనుబంధ సంఘాలతో సమావేశం అని పెట్టుకుని అదే పనిగా ఏడ్చిన వీడియోను రిలీజ్ చేసుకున్నారు. పథకాలు ఏమీ ఇవ్వడం లేదని చెప్పకొస్తన్నారు. వసతి దీవెను,విద్యా దీవెన ఇలా తన నోటికి వచ్చిన పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఆయనకు అర్థం కాలేదేమో కానీ..విద్యార్థులంతా హ్యాపీగా ఫీజుల బాధ లేకుండా కాలేజీల్లో చేరిపోయారు. వైట్ కార్డు ఉన్న వాళ్లకు ఫీజులు వసూలు చేయలేదు. ప్రభుత్వం చూసుకుటుంది. జగన్ గెలిస్తే నాలుగేళ్ల తర్వాత వచ్చే పెన్షన్ మూడున్నరవేలు.కానీ చంద్రబాబు తొలి నెల నుంచే నాలుగు వేలు ఇస్తున్నారు. నాలుగు నెలలకే ఆయన అన్ని పథకాలకు జీవోలు ఇచ్చి అమలు చేసినట్లుగా చెప్పుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం కూడా చే్యాలనుకుంటున్నారేమో కానీ ఆయన ఏడుపు చూసి పార్టీ నేతలకూ ఇబ్బందిగానే ఉంటోంది.
కూటమి ప్రభుత్వంపై సొంత క్యాడర్ లో అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిపై చర్యలు తీసుకోకపోవడమే. జగన్ రెడ్డి ఇంటికి ఖర్చు పెట్టుకున్న మొత్తాన్ని వసూలు చేయకపోవడం.. ఫర్నీచర్ కూడా వెనక్కి తీసుకోకపోవడం దగ్గర నుంచి వేధించిన అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడంపైనే అసంతృప్తి ఉంది. కానీ జగన్ మరో నాలుగేళ్ల పాటు ఇదే స్క్రిప్ట్ వినిపించడానికి మెంటల్ గా రెడీ అయిపోయారు.