ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహరాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో వెటకారం చేశారు. అక్కడి రాజకీయ నేతల కన్నా… అక్కడ ముఖ్యమంత్రులుగా పదవీ ప్రమాణం చేసేవారి కన్నా.. తాను ఎంతో గొప్ప వాడ్ని చెప్పుకునే ప్రయత్నంలో… ఆ రాష్ట్ర నేతలను కించ పరిచేశారు. ఎందుకంటే.. తాను ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులిచ్చారట.. మహారాష్ట్రలో.. మాత్రం.. ఒక్కటంటే.. ఒక్కటే డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తున్నారట… ” అంతలావు మహారాష్ట్రకు డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. రాజకీయాలు అలా ఉన్నాయి. నేను ఎవరూ ఊహించని విధంగా నాతో పాటు ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులిచ్చాను. వారిలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు…” అని జగన్మోహన్ రెడ్డి తన గొప్పతానికి తాను.. మహారాష్ట్ర రాజకీయాలను చూపి సర్టిఫికెట్ జారీ చేసుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా.. మహారాష్ట్ర పరిణామాలను.. తన కేబినెట్ కూర్పుతో పోల్చుకోవడమే చాలా మందిని ఆశ్చర్యపరించింది. మహారాష్ట్రలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులు ఇస్తే.. అసలు డిప్యూటీ సీఎం అనే పోస్టే… పవర్ లెస్ గా మారుతుందన్న ఉద్దేశంతో.. ఒక్క డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యారు. ఎంత మంది కావాలంటే.. అంత మంది డిప్యూటీ సీఎంలు ఇచ్చుకోవడానికి మహారాష్ట్రలోనూ అవకాశం ఉంది. పైగా అక్కడ రాజకీయ అవసరం కూడా ఉంది. కానీ .. వారే.. అలాంటి ప్రయత్నం చేయలేదు.
కానీ.. ఏపీలో మాత్రం.. ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేసిన.. జగన్మోహన్ రెడ్డి… వారికి .. మాత్రం ప్రాధాన్య శాఖలు కల్పించలేదు. ఫలితంగా.. ఏపీ మంత్రివర్గంలో.. డిప్యూటీ సీఎంలు ఎవరో చాలా మంది మర్చిపోయారు. బహుశా.. ఆ మంత్రులు కూడా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు.. తాను చేసిన దాన్నే గొప్పగా చెప్పుకుంటూ.. ఇతరులు అలా చేయలేదంటూ.. వెటకారంగా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం.