వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదని ఎల్లో మీడియాతో కూడా పోరాటం చేయాలని కార్యకర్తలకు బహిరంగసభా వేదిక మీదుగా పిలుపునిచారు. అదేదో దాడులు చేయడానికి పిలుపులన్నట్లుగా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ ఫైవ్లను చెప్పుకొచ్చారు. ఒక నాడు.. వైఎస్.. ఆ రెండు పత్రికలు అంటూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆయన వారసుడిగా జగన్… ఆ సంఖ్యను మరింత పెంచుకుంట పోయారు. ఎల్లో మీడియా అని పేరు పెట్టారు.
మీడియా హేట్ డిసార్డర్‌లో ఇది రెండో స్టేజ్..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఓ రకమైన మీడియా డిసార్డర్‌తో బాధపడుతున్నాడని.. ఆయన మాటలను చూస్తే అర్థమైపోతుంది. కొన్నాళ్ల కిందటి వరకూ.. ఆయన అవినీతి, అక్రమ సంపాదన.. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని… సీబీఐ కేసుల గురించి మీడియా రాసినా.. అదంతా కల్పనే అన్నట్లుగా ఆయన ఆరోపించారు. తనపై దుష్ప్రచారం అని చెప్పుకొచ్చారు. చివరికి తన భార్యను.. కూడా అక్రమ సంపాదన కేసుల్లో ఇరికించేసిన జగన్… ఆ విషయం పత్రికలు రాస్తే మాత్రం.. ఆ కుట్ర అంతా పత్రికలదే. ఇది ఒకస్టేజ్. అంటే.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవడం ఒక స్టేజ్. ఇప్పుడేమంటున్నారు… తనపై వస్తున్న వార్తల గురించి కాకుండా… ప్రభుత్వం చేసే పనుల్ని బూతద్దంలో చూపిస్తోందని.. తెగ మధనపడిపోతున్నారు. అంటే.. ప్రభుత్వానికి పాజిటివ్ ప్రచారం మీడియా చేస్తోందని ఆయన బాధ. జరుగుతున్న పరిణామాల్ని ప్రజలకు అందించడం మీడియా బాధ్యత. ప్రభుత్వ పరంగా అది ఇంకా ముఖ్యం. అది కూడా తప్పని.. అసలు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని… ఆయన చెప్పే మాటల్నే చెబితేనే మీడియా అనుకుంటే… అది ఇబ్బందికర స్టేజ్‌నే.
మీడియా ఏం చెప్పాలో చెప్పలేవు జగన్..
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షానికీ అంతే బాధ్యత ఉంది. మీడియా కూడా.. ప్రతిపక్ష నేతకు అంత కంటే ఎక్కువే ప్రాధాన్యత ఇస్తుంది. ఒకటి ,రెండు చానళ్లు ప్రసారాలు ఇవ్వనంత మాత్రాన… మీరు బహిష్కరించినంత మాత్రాన… ప్రజలకు అందే సమాచారం.. తెలియాల్సిన సమాచారం తెలియకుండా ఉండదు. అయినా ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలోనూ నిలదీసేందుకు.. ప్రతిపక్ష నేతకు బాధ్యతలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో.. ఏం చేశారు..?. పాదయాత్ర చేసిన నెల రోజుల పాటు… అడపాదడపా కార్యక్రమాలే తప్ప.. ఏదైనా ఓ కార్యక్రమం పెట్టారా..? . ఇంట్లో కూర్చుని… చిన్న స్థాయి నేతల్ని పార్టీలో చేర్చుకుని సొంత మీడియాకు ఫోటోలు రిలీజ్ చేసుకుని.. అదే పెద్ద కార్యక్రమాలు అనుకుంటే మీడియా ఏం చేస్తుంది.. ?. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తేనే… అసలు విషయం తెలుస్తుంది. అసెంబ్లీకి వెళ్లకుండా… ప్రజాస్వామ్యానికి కనీస గౌరవం ఇవ్వని.. జగన్ … మీడియాను విమర్శించడమే.. అతి పెద్ద అనారోగ్యం.. !
“సాక్షి”కి ఏ పేరు పెట్టాలి..?
హైదరాబాద్ లో ఎవడో జేబు కొడితే.. దానికి, లోకేష్‌కి లింక్ పెట్టే పత్రికను ఏం పేరు పెట్టాలి..?
ఒక్క ఆధారం లేకుండా పోలీసుల్లో కూడా కుల చిచ్చు రేపే ప్రయత్నం చేసే మీడియకు ఏం పేరు పెట్టాలి..?
సొంత రాష్ట్రంపై విషం చిమ్మే పత్రికకు ఏం పేరు పెట్టాలి..?
సొంత రాష్ట్రానికి పెట్టబడులు వస్తే వెనక్కి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో కథనాలు రాసే పత్రికలకు ఏం పేరు పెట్టాలి..?
ఇలా చెప్పుకుంటూ.. పోతే.. జగన్ మీడియాకు.. లేని అవలక్షణాలు లేవు. మీడియా ప్రపంచంలోనే.. జగన్ మీడియా… చాలా తేడా మీడియా. ప్రమాణాలు దిగజారిపోవడం అంటూ జరిగితే అది సాక్షి మీడియా ద్వారానే. దీనికేం పేరు పెట్టాలి.
అనుకూలంగా చెబితేనే అసలు మీడియానా..?
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు వేయాలి. లేకపోతే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వేయాలి. అలా చేస్తేనే అసలు మీడియా. జగన్ ఆలోచనలు ఇంత వరకే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల గురించి ఎంత తెలుసో.. మీడియా గురించి అంత గురించి తక్కువే తెలుసని ఈ మాటల ద్వారా అర్థమైపోతుంది. అందుకే.. గెట్ వెల్ సూన్ జగన్..!