తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్తో కుమ్మక్కు అయి… ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు.. జగన్ భంగం కలిగిస్తున్నారని.. ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బకొడుతున్నారని.. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు …కౌంటర్ ఇవ్వబోయి.. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు వాదన వినిపించారనే అభిప్రాయానికి వచ్చారు. ప్రత్యేకహోదాకు కేసీఆర్ మద్దతిస్తున్నారని.., దానికి అభినందించాల్సిందేనంటూ.. స్వామి భక్తి ప్రదర్శించారు. విమర్శించడం సిగ్గులేని తనమంటూ… చంద్రబాబుపైనా మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేకహోదాకే మద్దతిస్తున్నారని.. తనకు కాదన్నట్లుగా చెప్పుకొచ్చారు. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్న వారైనా… తన వాదన విని.. ఆశ్చర్యపోక తప్పని పరిస్థితిని జగన్ కల్పించారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న కాంగ్రెస్ అంతు చూస్తామని కేసీఆర్ అనలేదా..?:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణకు చెందిన పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయని.. టీఆర్ఎస్ నేతలు.. గగ్గోలు పెట్టారు. ఏపీకి హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై చెలరేగిపోయారు. అంత ఎందుకు.. సోనియా గాంధీ అనారోగ్యంతో ఉండి మరీ… మేడ్చల్ సభలో ప్రసంగించారు. తెలంగాణతో పాటు .. ఏపీకి ఆమె.. కొన్ని హామీలిచ్చారు. వాటిలో ప్రత్యేకహోదా ఒకటి. ఆ తర్వతా టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ సహా.. సహా ఎలా చెలరేగిపోయారో తెలియదా..?. తెలంగాణ ఇచ్చిన తల్లిగా.. సోనియాను చెప్పే కేసీఆర్.. తెలంగాణ గడ్డపై నుంచి ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించడానికి… సోనియాకు ఎంత అహంకారం అని… విమర్శించలేదా..?. కాంగ్రెస్ పార్టీ ఏదో… ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణ సంపదంతా.. దోచుకెళ్లి.. ఏపీలో పెడుతుందని ప్రచారం చేయలేదా..? మరి ఇప్పుడు వారు హోదాకు ఎ విధంగా మద్దతు తెలుపుతున్నారు. ఏపీ ప్రజల్ని మోసం చేయడానికి కాదా..?. అసలు తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేసే పార్టీ.. ఏపీ ప్రయోజనాల కోసం ఎలా పని చేస్తుంది..? ఈ మాత్రం ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉండదా..?
ఇస్తామన్న కాంగ్రెస్ చేదు…! అంతు చూస్తామన్న టీఆర్ఎస్ ముద్దాం..? :
రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో ఏపీకి లభించిన హామీ ప్రత్యేకహోదా. బీజేపీ పట్టుబట్టి సాధించింది. కానీ ఇవ్వలేదు. కానీ.. తామిచ్చిన హామీ కాబట్టి.. అమలు చేస్తామని.. తప్పు దిద్దుకుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు.., రాహుల్ గాంధీ… ప్రవాసాంధ్రులు ఎక్కడ కనిపించినా.., ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని ప్రకటిస్తున్నారు. తెలంగాణ గడ్డ పై నుంచి సోనియాగాంధీ కూడా ప్రకటించారు. ప్రత్యేకహోదా ఇస్తామని.. ఇంత ఏకపక్షంగా.. గట్టిగా చెబుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం… కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం విశ్వసించడం లేదు. కారణం ఏమిటి..?. కానీ… ఏపీ ప్రత్యేకహోదా విషయంలో అనేక పిల్లిమొగ్గలు వేసి.. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసే టీఆర్ఎస్… హోదాకు మద్దతు అనగానే పరుగులు పెట్టుకుంటూ పోటీ కూటమిగా మారే ప్రయత్నాలు చేయడం సందేహం..! జగన్ హోదా సాధనే లక్ష్యం అయితే.. ఎవరు ఇవ్వగలరు..? ఎవరు సాధించగలరన్న విశ్లేషణ చేసుకుంటారు. అలాంటి విశ్లేషణ చేసుకున్నా… ముందుగా కాంగ్రెస్ పార్టీనే రేసులో ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే… బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలకే సాధ్యం. ఆ పార్టీలు లేదా.. ఆ పార్టీలు మద్దతిచ్చిన కూటములు రావాలి. లేదా ఆ ఆ పార్టీలకే కూటములు మద్దతివ్వాలి. అంతే కానీ.. 17 పార్లమెంట్ స్థానాలున్న.. తెలంగాణ అధికార పార్టీకి. పోలోమంటూ పరుగెత్తుకు వచ్చి పార్టీలు మద్దతిచ్చే అవకాశం లేదు. ఏ విధంగా చూసినా.. టీఆర్ఎస్ హోదా కన్నా.. కాంగ్రెస్ హోదానే… ప్రత్యేక హోదా ఇచ్చే .. సాధించే విషయంలో చాలా పెద్దది. కానీ.. ఎందుకు… కాంగ్రెస్ కన్నా.. టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు..?
జగన్కు కావాల్సింది తనకు కేసులు లేని ప్రత్యేకహోదానే..?:
జగన్కు కావాల్సింది ఏపీకి ప్రత్యేకహోదా కాదు.. తనకు ప్రత్యేకహోదా కోసమే ఆయన పోరాడుతున్నారని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత ఎలాగూ.. బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాదు. ఏపీలో కేసీఆర్, తెలంగాణలో జగన్ పార్టీలు.. సాధించే సీట్లతో.. బీజేపీకి మద్దతివ్వాలనే వ్యూహంతోనే.. ఈ రాజకీయం నడుస్తోంది. ఇక్కడ ప్రత్యేకహోదా ప్రజల్ని మోసగించడానికేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అందుకే.. ప్రత్యేకహోదా పేరుతో.. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతిస్తున్నారు. ఏపీపై… టీడీపీపై.. తన పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. నేతల్ని వైసీపీలో చేర్పిస్తున్నారు. రూ. వెయ్యి కోట్లు ఇచ్చారన్న ప్రచారమూ జరుగుతోంది.