కొద్ది రోజుల కింట.. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చింది. బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా వ్యతిరేకించాయి. కానీ..ఏపీలో అధికార పార్టీ.. అత్యధిక ఎంపీలున్న పార్టీల్లో మూడో ప్లేస్‌లో వైసీపీ.. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. అనుకూలంగా ఇరవై రెండు మంది లోక్‌సభ ఎంపీలు ఓటేశారు. రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు కూడా అనుకూలంగా ఓటేసి.. పౌరసత్వ బిల్లుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటంలో వైసీపీ తనదైన ముద్ర వేసింది. మరి ఇప్పుడేమయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సొంత జిల్లా కడపకు వెళ్లిన సమయంలో.. ముస్లింల ఆందోళన చూసి.. మనసు మార్చుకున్నారు.
పౌరసత్వ చట్ట సవరణకు… ఎన్నార్సీకి తాను వ్యతిరేకమని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నార్సీకి తాము అంగీకరించబోమని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. ముస్లింలు… గత కొద్ది రోజులుగా… ఆందోళనలతో హోరెత్తిస్తున్నా.. జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. నరేంద్రమోడీ.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ పెట్టాలనే ఆలోచన లేదని.. అలాంటి చర్చ జరగలేదని.. ఢిల్లీలో ప్రకటించిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. కడప జిల్లా పర్యటనలో.. ఎన్నార్సీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తాము అనుమతించేది లేదని ప్రకటించారు.
అయితే.. పార్లమెంట్లో భేషరతుగా.. బిల్లుకు మద్దతుగా ఓటేయడం మాత్రం రికార్డెడ్‌గా ఉంటుంది. అదే అసలైన విధానం. పార్టీలన్నీ సమర్థించినట్లుగా.. ఆ బిల్లు పాసైపోయింది. కనీసం.. వ్యతిరేకించిన పార్టీల జాబితాలో కూడా వైసీపీ లేదు. కానీ.. ముస్లిం ఓటర్లు వ్యతిరేకమవుతున్నారన్న కారణంగా ఇప్పుడు మాత్రం.. తాము ఎన్నార్సీని వ్యతిరేకిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి.. మమతా బెనర్జీలాగా.. కేజ్రీవాల్లాగో.. ముస్లింలకు మద్దతుగా పోరాడితే తప్ప… ఆయనపై.. ఆ వర్గంలో నమ్మకం కుదరడం కష్టమేనంటున్నారు.