వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను పాదయాత్ర చేస్తున్న జిల్లాలన్నింటికీ వరుసగా పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించిన ఆయన …తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు పేరు పెడతానని ప్రకటించేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏమీ అల్లూరి సీతారామరాజును.. గౌరవించలేదని.. తీర్మానిం చేసిన.. జగన్.. పశ్చిమగోదావరి జిల్లాకు.. ఆయన పేరు పెట్టడంతోనే… ఎవరూ ఇవ్వలేని గౌరవాన్ని తీసుకొస్తానన్నట్లు ఘనంగా ప్రకటించారు. దీన్ని కూడా జగన్ పూర్తి కులం కోణంలోనే ఆవిష్కరించారు.
“పాదయాత్రలో ఉన్ననా వద్దకు కొంత మంది .. క్షత్రియు కులస్తులు వచ్చి..అ్లూరి సీతారామరాజును ఇప్పటి వరకూ ఎవరూ సరిగ్గా గౌరవించలేదని.. తన దృష్టికి తీసుకొచ్చారని.. అందుకే… రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..” అని వైఎస్ జగన్ చెప్పేసుకున్నారు. కృష్ణా జిల్లాలోనూ జగన్ ఇలాంటి ప్రకటనే చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ నాయకులే ఖండించి వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. కులం కోణంలో ఎన్టీఆర్ పేరును వివాదాస్పదం చేసి.. రాజకీయ లబ్దిపొందే ప్రయత్నాలు చేశారని..విమర్శలు వచ్చాయి. తర్వాత అది సద్దుమణిగిపోయింది.
ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలోనూ జగన్ అలాంటి ప్రయత్నమే చేశారు. కులం కోణంలోనే అల్లూరి పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెడతానమడంతోనే పెద్ద రాజకీయం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప.గో జిల్లాలో క్షత్రియులకు .. బలంగా ఉన్న మరో సామాజికవర్గానికి మధ్య తరచూ వివాదాలు తలెత్తతూంటాయి. ఇప్పుడు అల్లూరి పేరు ప్రకటనతో వాటిని మరింత రాజకీయం చేసే ఉద్దేశంలో జగన్ ఉన్నారన్న అనుమానాలు ఇతర రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి.
అయినా… జిల్లాలకు పేర్లు పెట్టడమే.. మహనీయులకు ఇచ్చే గౌరవం అన్నట్లుగా జగన్ మాట్లాడుతూండటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ లాంటి యుగపురుషుడికి… ఓ జిల్లాకు పేరు పెట్డడం ద్వారా కొత్తగా తెచ్చే గౌరవం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు .. ఓ గొప్ప మన్యం యోధుడికి చరిత్ర పుస్తకాల్లో ఉన్నారు. ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టడం అంటే.. గౌరవించడం కన్నా.. కించ పరచడమే అవుతుంది. మొత్తానికి మహనీయుల్ని కుల రాజకీయాలకు వాడుకోవడానికి జగన్ ఏ మాత్రం సిగ్గు పడటం లేదనన్న భావన వ్యక్తమవుతోంది.