వైసీపీ అధినేత జగన్ రెడ్డి బయటకు వస్తే వంద మంది ఉన్నా సరే వారు జగన్ రెడ్డి చుట్టూ మూగిపోతారు. చుట్టూ అంతా ఖాళీగా ఉంటుంది. ఆయినా ఆయనపై అక్కడ ఉన్న వారు ఎందుకు మీదపడిపోతారో ఎవరికీ అర్థం కాదు. తోసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఆవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి స్కిట్స్ ను.. కాస్త ఖర్చు పెట్టి…సెక్యూరిటీ యాంగిల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాప్తాడులో హెలిప్యాడ్ దగ్గరకు తోలుకొచ్చిన కార్యకర్తలు ఎందుకు పరుగులు పెట్టారో మెల్లగా ఓ క్లారిటీ వస్తోంది. హెలికాఫ్టర్ అంటే.. కాస్త పెద్ద ఇష్యూ కాబట్టి అక్కడ ఏదైనా రచ్చ చేస్తే అది నేషనల్ టాపిక్ అవుతుందని.. అలా జగన్ రెడ్డి సెక్యూరిటిపై చర్చ పెట్టవచ్చని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రయత్నించారు. వైసీపీ నేతలు జగన్ సెక్యూరిటీ గురించి మాట్లాడటం ప్రారంభించారు. చివరికి అందరూ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ ప్లాన్ పై క్లారిటీ వచ్చింది.
డబ్బులిచ్చి మరీ జనాల్ని తోలుకొచ్చుకుని వారంతా మీద పడిపోయేలా చేసుకుని .. సెక్యూరిటీ లేదని నాటకాలు ఆడటం అందరికీ అర్థమైపోతూనే ఉంది. జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి రేంజ్ లో సెక్యూరిటీ సెటప్ ఉండాలని కోరుకుంటారు. సమీకరణ చేయకపోతే .. వంద మంది కూడా వచ్చే అవకాశం ఉండదు. అయినా ఆ మాత్రం సెక్యూరిటీ ఉంటే… కాస్త బిల్డప్ వీడియోలు తీసుకోవచ్చని ఆయన అనుకుంటున్నారేమో కానీ.. స్కిట్లు వేసుకుని పరువు పోగొట్టుకుంటున్నారు.