ప్రజాధనాన్ని సొంత ఇంటికి ఖర్చు పెట్టుకుని ఇప్పుడు దాన్ని పార్టీ ఆఫీసుగా వాడేసుకుంటున్న జగన్ వ్యవహారశైలి పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో కోడెల తన వద్ద ప్రభుత్వ ఫర్నీచర్ ఉందని లేఖ రాసి.. దాన్ని తీసుకెళ్లవచ్చని లేదా ఖరీదు కడితే చెల్లిస్తానని చెబితే.. దాన్ని దొంగతనంగా ప్రచారం చేసి ఆయన పరువు తీసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
ఇప్పుడు జగన్ రెడ్డి అంత కంటే ఎక్కువ చేశారు. సీఎంగా అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే తన క్యాంపాఫీస్కు కిటికీలతో సహా పదిహేను కోట్లుకుపైగా ఖర్చు పెట్టి సోకులు చేయించుకున్నారు. ఐదేళ్లు అక్కడి నుంచి పాలన చేశారు. ఓడిపోయాక ఇప్పుడు దాన్ని పార్టీ ఆఫీసుగా మార్చి వాడుకుంటున్నారు. మరి ప్రజాధనం ఖర్చు పెట్టి కొన్నవన్నీ ఎందుకు వెనక్కి ఇవ్వరు ?. కోడెలకు ఓ న్యాయం .. జగన్కు మరో న్యాయం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
నిజానికి జగన్ ఇంటికి ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టారు. ఆ జీవోలు బయటకు వస్తున్నాయనే.. జీవోఐఆర్ను ఎత్తేశారు. ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు తీస్తే మొత్తం ప్రజాధనం ఎన్నికోట్లు సొంత ఇంటికి ఖర్చు పెట్టారో స్పష్టత వస్తుంది. తన ఇంటికి ఏ సీఎం కూడా రూపాయి ఖర్చు పెట్టుకోరు. కానీ జగన్ మాత్రం అన్నిటికి అతీతం. ప్రజాధనాన్ని సొంత ధనంగా వాడేసుకుంటారు. ఇప్పుడు దొరికిపోయారు. కోడెలలా ఆయనపై కేసులు పెడతారోలేదో వేచి చూడాల్సి ఉంది.