ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వ్యవధిలో దాదాపుగా 9 లక్షల ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులపై ఒక్కసారిగా.. కల్లోలం రాగడంతో.. ఆగిపోయాయి. లేకపోతే.. ఓ 30, 40 లక్షల దరఖాస్తులు వచ్చి ఉండేవి. అన్నీ టీడీపీ ఓటర్లను టార్గెట్ చేసినవే. ఒకరికి తెలియకుండా.. ఒకరు… వందల ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేసినవే. ఈసీ అధికారులు హైరానా పడ్డారు. టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చివరికి.. జగన్మోహన్ రెడ్డి.. ఇది తమ పనేనని అంగీకరించారు. ఇది మరింత ఆశ్చర్యకరం. పోలీసులు దాదాపుగా 250 క్రిమినల్ కేసులు నమోదు చేసిన తర్వాత ఎందుకు ఆయన ఇది తమ పార్టీ పనేనని అంగీకరించారన్నది ఆసక్తికరం.
హైదరాబాద్ నుంచే ఫామ్-7ల వెల్లువ..!
కారణం ఏదైనా కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండు శాతం ఓట్లతో ఓడిపోయామని పదే పదే చెబుతూ ఉంటారు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకోరు. అవి తీసుకోకుండా.. రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని భావిస్తూంటారు. ఈ సారి ఆ రెండు శాతం ఓట్లను టార్గెట్ చేసి…ఓట్ల తొలగింపు స్కెచ్ ప్రారంభించారని చెబుతున్నారు. అందుకే.. ఓ నిర్దేశిత సమయం పెట్టుకుని… ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నాలుగైదు రోజుల ముందు.. వెల్లువలా దరఖాస్తులు చేయడం ప్రారంభించారు. సాధారణంగా.. ఈసీకి మాత్రమే ఎలాంటి దరఖాస్తులు ఎన్ని వస్తుయన్నాయని తెలుస్తుంది. అసాధారణంగా రావడంంతో.. కొన్ని చోట్ల వెరిఫికేషన్‌లో ఫేక్ అని తేలడంతో… టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. గుట్టు రట్టయింది. ఇప్పటికి ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయో ఎవరికీ తెలియదు.
అంతా ప్రశాంత్ కిషోర్ స్కెచ్చేనా..?
ఇదంతా.. జగన్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ వ్యూహమని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ కార్యకర్తల పేర్లతో.. హైదరాబాద్ నుంచి ఈ దరఖాస్తులన్నీ అప్ లోడ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా యాప్ కూడా రూపొందించారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టమైన సమాచారం రావడంతోనే… టీడీపీ వర్గాలు కొద్ది రోజుల నుంచి పీకేపై విరుచుకుపడుతున్నాయి. తోక కత్తిరించి బీహార్ కు పంపుతామని హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. మొత్తం వ్యవహారం ప్రభుత్వానికి తేలిపోయిందని.. పీకేని కాపాడటానికి జగన్ ఇలా.. ఫామ్-7లు తమ పనేనని చెప్పుకున్నారని చెబుతున్నారు.
ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకే ఆరోపణలు చేశారా..?
జగన్మోహన్ రెడ్డి ఓట్ల తొలగింపు వ్యవహారంపై .. చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. దొంగ ఓట్ల పేరుతో ఈసీపై ఒత్తిడి తెచ్చి.. తాము చేసే ఫామ్-7 దరఖాస్తులన్నింటినీ ఆమోదించేలా వ్యూహం పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫామ్ -7లు హైదరాబాద్ నుంచి చేసుకోవడానికి.. ఏదైనా కేసులయితే.. తమ రాష్ట్రంలో జరిగింది కాబట్టి.. మేము చూసుకుంటామనే వాదన వినిపించడానికి.. అక్కడి ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. అలాగే.. కేంద్రం కూడా.. ఎన్నికల అధికారిని మార్చి సహకరించింది. ససోడియాను మార్చి ద్వివేదీ వచ్చిన తర్వాత అసలు కలకలం ప్రారంభమయింది. మొత్తానికి ఎన్ని ఓట్లపై వేటు వేశారో… మాత్రం ఇంకా క్లారిటీ లేదు.